చినుకమ్మ
ఎందుకమ్మ నీ చెణుకులతో
కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నావ్
తొలకరి కి పలకరించి
మము పులకరింప జేసిన
ఆనందం అంతలోనే ఆవిరి
చేయడం
నీ కెట్లా న్యాయమమ్మా
బంగాళా ఖాతం లో వాయుగుండం
మా పాలిట గండమై
నిదానంగా కురిసె నీలో
ఆవేశాన్ని నింపితే నిగ్రహించుకోకుండా
పచ్చగా పరవశిస్తున్న మా పంటచేలపై
పగబట్టి పంజా విసరడం
నీకు తగునానమ్మా
ఎత్తు మేడల్లో ని మనుషులపై
మెత్తని ప్రేమ ను కురిపించి
పల్లపు నేల బతుకులపై
నీ ప్రతాపం చూపడం
పాలకులిచ్చిన శిక్షణను కుంటా?
నీవు సకాలం లో కురిస్తే నే హర్షం
కాదు కూడదంటూ
కాని కాలం లో వచ్చి ఇష్టం లేకున్నా తిష్ట వేసి
మమ్ముల కష్టపెట్టడం చూస్తుంటే నాకనిపిస్తుంది
ఆధిపత్యము కొరకు హద్దులు మీరే
మనుషులు లెక్కనే
నీవు కూడా అవ లక్షణాలను ఒంట బట్టించుకొని అదుపు తప్పుతున్నట్లు.
వద్దమ్మా వద్దు నిన్నిట్లా చూడలేము
నీ సహజత్వాన్ని దెబ్బతీసి
ఫలితాన్ని ఆనుభవిస్తున్న
అపరాధం మాదేకావచ్చు
అయినా నీవు శాంతిస్తేనే
మళ్ళీ నిన్ను ప్రేమగా స్వాగతిస్తాం….కాస్త నిదానించు…
– గన్ రెడ్డి ఆదిరెడ్డి, 9494789731