Take a fresh look at your lifestyle.

సంపదలో అమెరికాను దాటిన చైనా

‘‘ ‌చైనా ఒక వైపు సంపదను అపారంగా పెంచుకోవడం, ఇరుగు పెరుగు దేశాలకు అడిగి సహాయం చేస్తూ తన అదీనంలోకి తీసుకోవడం, సరిహద్దుల్లో అస్థిరతను సృష్టించడం, పొరుగు దేశాల భూభాగాలను దురాక్రమణ చేయడం, ఆధిపత్య గర్వం తలకెక్కడం, పేద దేశాలను భయపెడుతూ స్వాధీన పరుచుతోవడం లాంటి పలు అవాంఛనీయ కదలికలతో చైనా ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తున్నదని నిపుణులు వివరిస్తున్నారు. సంపద పెంచుకోవడాన్ని అన్ని దేశాలు స్వాగతిస్తాయేగాని అక్రమ మార్గాల్లో ఆధిపత్యం చలాయించడం మాత్రం అవాంఛనీయం, ఆక్షేపనీయమని చైనా గుర్తించాలి. సంపద పెరిగితే శాంతి సమకూరదని, సమన్వయంతో ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందడం మాత్రమే ఆహ్వానించదగిన పరిణామమని అందరం గమనిద్దాం.’’

(మాక్‌ ‌కిన్సే గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ అధ్యయనం ఆధారంగా)

గత రెండు దశాబ్దాలలో ప్రపంచ సంపద మూడు రెట్లు పెరిగిందని, మొదటి సారి అమెరికా సంపదను దాటి చైనా అత్యంత సంపన్న దేశంగా తొలి స్థానానికి చేరిందనే ఆశ్చర్యకర విషయాన్ని జూరిచ్‌ ‌మాక్‌ ‌కిన్సే గ్లోబల్‌ ఇనిస్టిట్యూట్‌ అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. పలు దేశాల ఆదాయ వ్యయాలను పరిశీలించిన జూరిచ్‌ ‌సంస్థ ప్రపంచ సంపదలో 60 శాతం మేరకు 10 దేశాలు మాత్రమే కలిగి ఉండడాన్ని ప్రత్యేకంగా గుర్తించారు. ప్రపంచ దేశాల మొత్తం సంపద 2000లలో 156 ట్రిలియన్‌ ‌డాలర్లు ఉండగా, 2020లో 514 ట్రిలియన్‌ ‌డాలర్లకు చేరిందని పరిశోధనలు వివరిస్తున్నాయి. 2000 సంవత్సరంలో చైనా సంపద 7 ట్రిలియన్‌ ‌డాలర్లు నమోదుకాగా, 2020లో 120 ట్రిలియన్‌ ‌డాలర్లకు చేరడంతో 113 ట్రిలియన్‌ ‌డాలర్ల వృద్ధితో అమెరికా సంపదను దాటుతూ చైనా తొలి స్థానాలకు చేరడం గమనించారు. అమెరికా సంపద 2000 నుంచి 2020 వరకు దాదాపు రెండు రెట్లు, అనగా 50 ట్రిలియన్‌ ‌డాలర్లు మాత్రమే పెరగడంతో రెండవ స్థానానికి దిగడం గమనించారు.

ప్రపంచ సంపదలో అత్యధికంగా 68 శాతం వరకు రియల్‌ ఎస్టేట్‌ ‌రూపంలోనే కనిపిస్తున్నదనే విషయం బయట పడింది. వడ్డీ రేట్లు తగ్గడంతో రియల్‌ ఎస్టేట్‌ ‌ధరలు ఆకాశాన్ని అంటుకోవడం చూశారు. దేశాల సంపదల్లో అసమానతలు కరోనా విపత్తు అనంతరం అధికంగా పెరిగాయని, పేదలు నిరుపేదలుగా, ధనికులు అత్యంత కుబేరులుగా త్వరితగతిన మారడం గమనించారు. ఇండియా, చైనా, బ్రెజిల్‌, ‌యూయస్‌ ‌లాంటి దేశాల్లో 1 శాతం ధనికుల సంపద క్రమంగా పెరగడం జరిగింది. గత ఏడాదిగా ప్రపంచ కుటుంబ సంపదలు 7.4 శాతం పెరగడం గుర్తించారు. గత రెండు దశాబ్దాల్లో చైనా సంపద 113 ట్రిలియన్‌ ‌డాలర్లు, అమెరికా 90 ట్రిలియన్‌ ‌డాలర్లు, జర్మనీ మరియు ఫ్రాన్స్‌లు 14 ట్రిలియన్లు, యూకె/కెనడా/ఆస్ట్రేలియాలు 7 ట్రిలియన్‌, ‌జపాన్‌/‌మెక్సికోలు 3 ట్రిలియన్‌ ‌మరియు స్వీడెన్‌ 2 ‌ట్రిలియన్‌ ‌డాలర్లు పెరగడం జరిగింది. ప్రపంచ సంపదలో 35 శాతం భూమిపై, 33 శాతం గృహ/భవన నిర్మాణాలు, 11 శాతం మౌళిక వనరులు, 8 శాతం నూతన ఆవిష్కరణలు, 7 శాతం ఇతర రంగాల రూపంలో ఉన్నాయని తెలుస్తున్నది.

చైనా ఒక వైపు సంపదను అపారంగా పెంచుకోవడం, ఇరుగు పెరుగు దేశాలకు అడిగి సహాయం చేస్తూ తన అదీనంలోకి తీసుకోవడం, సరిహద్దుల్లో అస్థిరతను సృష్టించడం, పొరుగు దేశాల భూభాగాలను దురాక్రమణ చేయడం, ఆధిపత్య గర్వం తలకెక్కడం, పేద దేశాలను భయపెడుతూ స్వాధీన పరుచుతోవడం లాంటి పలు అవాంఛనీయ కదలికలతో చైనా ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తున్నదని నిపుణులు వివరిస్తున్నారు. సంపద పెంచు కోవడాన్ని అన్ని దేశాలు స్వాగతిస్తాయేగాని అక్రమ మార్గాల్లో ఆధిపత్యం చలాయించడం మాత్రం అవాంఛనీయం, ఆక్షేపనీయమని చైనా గుర్తించాలి. సంపద పెరిగితే శాంతి సమ కూరదని, సమన్వయంతో ప్రపంచ దేశాలు అభి వృద్ధి చెందడం మాత్రమే ఆహ్వానించదగిన పరిణామమని అందరం గమనిద్దాం. ప్రపంచ దేశాలన్నీ పేదరిక కోరల్లోంచి విడివడి గౌరవప్రద స్థాయికి చేరాలని, ఆ మహాయజ్ఞంలో భారతదేశం తన సంపదను ప్రతి ఏట పెంచుకుంటూ, ధనిక దేశాల సరసన సత్వరమే చేరాలని కోరుకుందాం. భారతాన్ని సుసంపన్న ప్రపంచ కేంద్రంగా మార్చుదాం.

dr burra madhusudhan reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి, విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల, కరీంనగర్‌ – 9949700037

Leave a Reply