- కొరోనా ముప్పును కప్పిపుచ్చుకునే ఎత్తుగడ
- భారత్ సరిహద్దుల్లో కాలుదువ్వుతున్న సైన్యం
జిన్‌పింగ్ వ్యవహార శైలిపై సర్వత్రా అనుమానాల్లు: ప్రపంచంలో కొరోనా వైరస్ విలయతాండం చేస్తున్న వేళ …దాని ప్రభావం నుంచి ప్రపంచ దేశాల దృష్టి మరల్చేందుకు చైనా మరో కొత్త ఎత్తుగడలు వేస్తోంది. చైనాలో పుట్టిన కొరోనా వైరస్ వలన 214 దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్ అక్కడి నుంచి వరసగా అన్ని దేశాలకు వ్యాపించింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ పై అమెరికా ప్రభుత్వం ఇప్పటికే పలు ఆరోపణలు చేసింది. అమెరికాతో పాటుగా చాలా దేశాలు చైనాను విమర్శిస్తున్నారు. ప్రపంచదేశాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా చైనా పట్టించుకోవడం లేదు. ఈ దశలో భారత్ సరిహద్దుల్లో యుద్ద వాతావారణం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఇండియాకు పాకిస్తాన్ తో మాత్రమే ముప్పు ఉండేది. నిత్యం బోర్డర్ లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో పాటుగా, ఉగ్రవాదులను ఇండియాలోకి చొరబడే విధంగా చేస్తూ కాశ్మీర్ లో అలజడులు సృష్టిస్తూ ఉండేది. ఇప్పుడు ఈ లిస్ట్ లో చైనా కూడా చేరిపోయింది. లడక్, సిక్కిం బోర్డర్లో చైనా ఆర్మీ మోహరించింది.
కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. పదుల సంఖ్యలో ఇరు దేశాల సైనికులు బాహాబాహీగా తలపడ్డారు. గాయాలపాలయ్యారు. దీంతో లడక్ బోర్డర్ ఉద్రిక్తకరంగా మారింది. ఇండియన్ ఆర్మీ అధినేత నరవాణెళి ఇటీవలే లడక్‌కు వెళ్లి అక్కడ పరిస్థితులు సక్షించారు. నరవాణెళి లడక్ పర్యటన రహస్యంగా ఉండటంతో అనేక అనుమానాలకు తావునిస్తున్నాయి. మరోవైపు చైనా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఆర్మీని మోహరిస్తోంది. పైగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. యుద్దానికి సిద్ధంగా ఉండేలా సైన్యాన్ని రెడీ చేయాలనీ దేశంలో చైనా రైల్వే పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. రైల్వే ట్రాక్ లనుంచి రైల్ బోగీలను నిర్మించడం వరకు మొత్తం చైనాకు చెందిన కొన్ని కంపెనీలు జాంబియాలో పనిచేయబోతున్నాయి.
సరిహద్దు సమస్యలన్నీ చైనా కుతంత్రాలే కేంద్ర మంత్రి వీకే సింగ్
న్యూఢిల్లీ,మే27(ఆర్‌ఎన్‌ఎ): చైనా, భారత్ మధ్య వివాదంగా మారిన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ని కచ్చితంగా ఎవరూ గుర్తించలేదని.. అందువల్లే.. ఇరుదేశాల మధ్య వివాదాలకు ఇది కేంద్రం అవుతోందని కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. కరోనాను చైనా సృష్టించిందని యావత్ ప్రపంచం కోడై కూస్తుందని.. దీంతో.. అందరి దృష్టి మరల్చడానికి చైనా ఎల్ఐసిని ఒక అవకాశంగా మార్చుకుంటుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే అనేక కంపెనీలు చైనా నుంచి తరలి వెలుతున్నాయని.. చాలా కంపెనీలు కూడా చైనాను ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఆ కంపెనీలను కాపాడుకోవాలి అంటే అందరి దృష్టి కరోనా నుంచి డైవర్ట్ చేయడానికి చైనా అడుతున్న నాటకంలో భాగంగా ఎల్ఏసీని తెరపైకి తెస్తుందని ఆయన అన్నారు. చైనా ఇలాంటి కుతంత్రాలుకు తరచూ వ్యూహాలు రచిస్తుందని.. కానీ, వాటికి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.