“59 చైనా అనువర్తనాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ప్రస్తుత నేపథ్యంలో- ఇవి సమాజంలోని భిన్న రంగాలతో ముడిపడి ఉండవచ్చు. కానీ, విద్యా ప్రగతి, శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి దోహదపడగల లేదా సమాజానికి సాధారణ విలువ జోడించగల విద్యా-విజ్ఞానపరమైన విలువలు వాటిలో ఏ ఒక్కదానికీ లేవు”
ఈ చైనా అనువర్తనాలు భారతదేశంలోకి చొచ్చుకుపోయినందువల్ల మనం పొందినదేమిటి? ఇందుకు దిగువ పేర్కొన్న మూడు అంశాలు ముఖ్యమైనవి కావచ్చు:
దేశంలో 2014 నుంచి 2020 మధ్య మొబైల్ ఫోన్ వాడకందారులలో స్మార్ట్ ఫోన్ వినియోగ వాటా పెరుగుదలపై ‘స్టాటిస్టా పరిశోధన విభాగం’ 2020 జూన్ 25న ప్రకటించిన అధ్యయనం ప్రకారం… 2018 నాటికి 26 శాతం కాగా, 2022కల్లా భారత్లో స్మార్ట్ ఫోన్ వాడకందారులు 36 శాతానికి చేరగలరని అంచనా.
దేశంలో ఇంటర్నెట్ వినియోగంపై ‘స్టాటిస్టికా’లో 2020 జూన్ 29నాటి సనికా దివాన్జీ వ్యాసం ‘స్టాటిస్టిక్స్ అండ్ ఫ్యాక్టస్’లో పేర్కొన్న ప్రకారం… 560 మిలియన్లకుపైగా వినియోగదారులతో భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆన్లైన్ విపణిగా పరిగణనలోకి వచ్చింది. తదనుగుణంగా 2023 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 650 మిలియన్లు దాటగలదని అంచనా. అయితే, వాడకందారుల సంఖ్య అత్యధికంగా కనిపిస్తున్నా, దేశంలో ఇంటర్నెట్ వ్యాప్తి 50 శాతంగా మాత్రమే నమోదైంది.
దేశంలో సామాజిక మాధ్యమాల విస్తృతి 2023 నాటికి జనాభాలో 31 శాతానికి వ్యాపిస్తుందని ‘స్టాటిస్టికా’లో 2020 మే 26నాటి సనికా దివాన్జీ తన ‘ఇండియన్ సోషల్ నెట్వర్కింగ్ పెనెట్రేషన్ 2017-2023’ వ్యాసంలో అంచనా వేశారు.
ఈ 59 చైనా అనువర్తనాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ప్రస్తుత నేపథ్యంలో- ఇవి సమాజంలోని భిన్న రంగాలతో ముడిపడి ఉండవచ్చు. కానీ, విద్యా ప్రగతి, శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి దోహదపడగల లేదా సమాజానికి సాధారణ విలువ జోడించగల విద్యా-విజ్ఞానపరమైన విలువలు వాటిలో ఏ ఒక్కదానికీ లేవు. ఇప్పుడిక సదరు చైనా అనువర్తనాలను నిషేధించిన తర్వాత మొబైల్ అనువర్తనాల రూపకల్పనకు సమాచార సాంకేతిక నైపుణ్య అనుసంధానంలో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల ముందున్న మార్గాలు… అవి ఏ మేరకు క్రియాశీల పాత్ర పోషించగలవు… తద్వారా సాంకేతిక పర్యావరణంతో కూడిన స్వదేశీ మొబైల్ అనువర్తనాల ఆవిర్భావానికి తోడ్పడగలవన్నది చర్చనీయాంశం. ఆ మేరకు స్వదేశీ అనువర్తనాల రూపకల్పన సాధ్యమైనపుడు వాటిని భారతదేశం కోసం… భారతదేశం చేత… భారతదేశం రూపొందించిన సొంత మొబైల్ అనువర్తనాలుగా చాటుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్వదేశీ మొబైల్ అనువర్తనాల రూపకల్పనకు సంబంధించి సంస్థాగత-పారిశ్రామిక భాగస్వామ్యం ఆవిర్భావంపై విశ్లేషణ దిశగా కింది అంశాలను పరిశీలించవచ్చు:
ఉప కులపతి
ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ