1
రండి బాబు రండి
కంపెనీ కాంట్రాక్టు సాగు
కరెన్సీ పంట దీస్తదంట
పొట్ట పగిలేలా ఆరగిద్దాం
పైసల కూడరిగే మిషిని కూడ సిద్దం.!
2
కమతాన్ని నమిలి మింగ
కార్పోరేట్ అనకొండ వచ్చింది
దేశభక్తులారా జల్దిరండి
మదరిండియాను…
బలికి అలంకరిద్దాం.!
3
పని సంస్కృతి వ్యవసాయం
మనీ వికృత కుతి యాపారం
కుతికల మెతుకులు ఇక
రైతు రక్తంతో తడిసే
రిలయన్స్ పొట్లం సరుకే.!
4
యుద్దంలో అన్నం
నిద్దురలో తినే మనం
కవాతై కదలకుంటే
నోట్లోకి బుక్క,అర్రాసు
పాటలో కొనుక్కోవాలె పక్కా.!
5
బువ్వ కుండను నార్తిండియా
కంపెనీకీ అమ్మింది పార్లమెంట్
అవ్వ(అమ్మ) చేతి కమ్మని
బువ్వ కావాలా నాయన…
అయితే గుండెలెదురొడ్డు.!
– చిలువేరు అశోక్