Take a fresh look at your lifestyle.

మిర్చి రైతుల చలో అసెంబ్లీ ముట్టడిపై కొరడా

  • ఎక్కడికక్కడే రైతులను నిర్బంధించిన పోలీసులు
  • విజయవాడ రాకుండా ముందస్తు అరెస్టులు
  • పోలీసుల తీరుపై మండిపడ్డ రైతు సంఘాల నేతలు
  • మిర్చి రైతుల ఆత్మహత్యలపై స్పందించాలని డిమాండ్‌
  • ‌నస్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి

విజయవాడ, మార్చి 10( : మిర్చి పంటకు తామర పురుగు సోకి పంట కోల్పోయి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నేతలు గురువారం చలో అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ ‌చేశారు. రైతుల కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక వద్ద రైతులంతా భారీ ఎత్తున నిరసన చేపట్టారు. రైతు సంఘాల సమన్వయ కమిటీ గురువారం చేపట్టిన మిర్చి రైతుల ’ చలో అసెంబ్లీ ’ లో ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, రైతులను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … కల్తీ మిర్చి విత్తనాల వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లింపు కోసం సంబంధిత విత్తనాల కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామరస్యంగా నిరసన తెలపడానికి వచ్చిన రైతు సంఘాల నాయకులను, రైతన్నలను అరెస్ట్ ‌చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. రైతు సంఘాల రాష్ట్ర నాయకులు పి.జమలయ్య మాట్లాడుతూ… రైతుసంఘాల నాయకుల అరెస్టులను ఖండిస్తున్నామన్నారు.

తామర పురుగు వలన దెబ్బతిన్న మిరప రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, వాస్తవ సాగుదారులైన కౌలురైతులను గుర్తించి నష్టపరిహారం చెల్లించాలని, దేవాలయ కౌలు రైతుల శిస్తులను రద్దు చేయాలని కోరుతూ ఆంధప్రదేశ్‌ ‌రైతుసంఘాల సమన్వయ సమితి చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపు నిచ్చిందన్నారు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వకుండా శాంతియుతంగా ఆందోళన చేయడానికి విజయవాడ వస్తున్న రైతులను, రైతు, కౌలురైతుల సంఘాల నాయుకులను నిర్బంధంచడం చాలా దుర్మార్గమన్నారు. రైతు, కౌలురైతు సంఘం నాయకుల ఇంటింటికీ వెళ్లి నోటీసులు ఇవ్వడం, విజయవాడకు వెళితే అరెస్టు చేస్తామని బెదిరించడం, పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి బైండోవర్‌ ‌కేసులు పెట్టడం చాలా అన్యాయమన్నారు.ఈ ఆక్రమ అరెస్టులను ఆంధ్రప్రదేశ్‌ ‌రైతు సంఘాల సమన్వయ సమితి తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అడిగినందుకు ఈ విధంగా రైతు, కౌలు రైతు సంఘాల నాయకుల ఇంటిముందు పోలీసులు తిష్ట వేయటం సరైంది కాదన్నారు.

కౌలురైతుల సంఘాల నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్‌ అరెస్ట్ ‌లు చేశారని, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వ్యవహరించడం సరైందికాదన్నారు. ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని చెప్పారు. ఈ విధంగా ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం ఏ విధంగానూ సమంజసం కాదని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని, ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని తెలిపారు. హౌస్‌ అరెస్టు చేసిన రైతులను, రైతు సంఘాల నాయకులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, శాంతియుతంగా విజయవాడకు వస్తున్న రైతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని, మిర్చి రైతుల సమస్యల పరిష్కారంపై దఅష్టి సారించాలంటూ ఆంధప్రదేశ్‌ ‌రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోందని పి.జమలయ్య పేర్కొన్నారు. రైతు సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… మిర్చి రైతుల సమస్యలపై చలో అసెంబ్లీ నిర్వహిస్తున్న రైతు నాయకుల్ని అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ ‌దగ్గర రైతు సంఘం నాయకుల్ని అక్రమంగా అరెస్టు చేసి పోలీసులు వ్యానుల్లోకి కుక్కిపడేశారని ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రంలో 5.25 లక్షల ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారని అన్నారు. తామర పురుగు ఆశించి 90 శాతం పంట సర్వ నాశనం అయిందని అన్నారు.

ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి ఏమాత్రం దిగుబడి రాక రైతులు అప్పులపాలయ్యారని చెప్పారు. ప్రకాశం, గుంటూరు కృష్ణాజిల్లాలో అప్పుల బాధతో 20 మంది పైగా మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన చెందారు. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులను ఆదుకునేందుకు ఎకరాకు లక్ష రూపాయల వంతున నష్ట పరిహారం చెల్లించేందుకు స్పష్టమైన హా ఇవ్వాలని డిమాండ్‌ ‌చేస్తూ రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయని వివరించారు. ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించే అంశాన్ని ప్రకటించకుండా, ఆందోళనకు దిగుతున్న వారిని అడ్డుకుంటూ పోలీసులను ప్రయోగించి ముందస్తు అరెస్టులు, గఅహ నిర్భందాలకు పూనుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా మిర్చి రైతులకు నష్ట పరిహారం చెల్లించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన రైతుల్ని తక్షణమే విడుదల చేయాలని చిట్టిపాటి వేంకటేశ్వర్లు డిమాండ్‌ ‌చేశారు

Leave a Reply