Take a fresh look at your lifestyle.

కోవిడ్‌ ‌కోరల్లో బాలల పండుగ

పిల్లల హక్కులు,సంరక్షణ మరియు విద్యపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్‌ 14 ‌న భారతదేశం అంతటా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం.భారత మొట్టమొదటి ప్రధాని పండిట్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రు జన్మదిన సందర్భంగా జరుపుకునే పండుగ.ఎందుకంటే అతనికి పిల్లలంటే చాలా ఇష్టం.ఒక ప్రధానిగా కాకుండా సహజ సిద్దంగా పిల్లలంటే ఇష్టపడేవాడు. లినేటి పిల్లలు రేపటి భారతదేశాన్ని తయారు చేస్తారు.మేము వారిని తీసుకొచ్చే విధానం దేశ భవిష్యత్తు నిర్ణయిస్తుందని పండిట్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ అన్నారులి పిల్లలతో చాచా నెహ్రూ అని పిలవబడే అతను పిల్లలు విద్య ద్వారానే సమ గ్రాబివృద్ధి సాధిస్తారని అన్నారు.

కానీ ఈ విద్యా సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగాబాలల దినోత్సవ వేడుకలు లేకుండా పాఠశాలలు బోసి పోనున్నాయి. కొవిడ్‌ ‌నిబంధనల ప్రకారం వివిధ వ్యాపార సంస్థలు, రవాణా రంగం, ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌సంస్థలు తెరుచుకున్నాయి కాని విద్యారంగానికి మాత్రం నవంబర్‌ 30 ‌వరకు లా క్‌ ‌డౌన్‌ ఉం‌డటం వల్ల పాఠశాల, కళాశాలల్లో పండుగ వాతావరణం లేకుండా పోయింది.ఎప్పటిలాగే పాఠశాలలు ఉంటే ఉపాధ్యాయులు వ్యాస రచన,ఉపన్యాస, చిత్ర లేఖనం  పోటీలు  నిర్వహించేవారు. నృత్య ప్రద ర్శనలు, స్వయం పరిపాలన దినోత్సవం, విహార యాత్రలతో పాఠశాలలు పండుగ వాతా వరణంతో ఉండేవి.ఆ పరిస్థితులు లేక పోవడం వల్ల విద్యార్థుల ఆసక్తులు, అభిరుచులను, నైపుణ్యాలను, వెలికితీసే అవకాశం లేకుండా పోయిందని ఉపాధ్యాయులు,విద్యావేత్తలు తల్లిదండ్రులు అంటున్నారు. కరోనా వలన విద్యతోపాటు, వైజ్ఞానిక  సాంస్కృతిక, సహపాఠ్య కార్యక్రమాలు వెనుకబడే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

– సామంతుల సదానందం, పరకాల,తెలంగాణసామాజిక రచయితల సంఘం , ప్రధాన కార్యదర్శి, వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply