Take a fresh look at your lifestyle.

బాల్యం, భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం

భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం..అందరూ అనుభవించే బాల్యం. అందుకే బాలల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో సంతోషంగా నిర్వహిస్తుంటారు. మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్‌ 14 ‌న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. మన దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ ‌నెహ్రూ. దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా సేవలు అందించింది కూడా ఆయనే. బ్రిటిష్‌ ‌పాలనలో చతికిలపడ్డ దేశాన్ని తనదైన దార్శనికత, ముందుచూపుతో పురోగతి దిశగా నడిపించారు. 1889 నవంబర్‌ 14‌న పుట్టిన నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా అమితమైన ప్రేమ.నెహ్రూకు పిల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజునాడే బాలల దినోత్సవం జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే,  నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం. అయితే ఆయన జీవితంలో ఎక్కువభాగం జైళ్ళలో గడపవలసి రావడంతో ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ కాలం గడపలేకపోయారు. అయితే 1954 కి ముందు అక్టోబర్‌ ‌నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు.1959 నవంబర్‌ 20‌న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు. కాగా, 1989లో పిల్లల హక్కులపై నవంబర్‌ 14‌న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం. పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది.

నెహ్రు ఎక్కడికెళ్లినా, పిల్లలను వెతికి మరీ ఆప్యాయంగా పలకరించేవారు. వారికి కానుకలను ఇచ్చి ఉత్సాహపరిచేవారు. ప్రధాని కాకముందు స్వతంత్ర పోరాటంలో భాగంగా ఆయన పలుమార్లు జైలు జీవితం అనుభవించారు. పిల్లలంటే ఎంతో ఇష్టమైన నెహ్రుకు తన కుమార్తె ఇందిర అంటే ఎనలేని అభిమానం. అందుకే ఆయన జైలు గోడల మధ్య నుంచి ఆమెకు అనేక ఉత్తరాలు రాసేవారు. స్వతహాగా రచయిత అయిన నెహ్రు తన కుమార్తెకు రాసిన ఉత్తరాల్లో బోలెడు మంచి సంగతులు చెప్పేవారు. పిల్లలు ఎలా ఉండాలి? ఎలాంటి విషయాలు నేర్చుకోవాలి? సమాజంలో మంచి, చెడులను ఎలా గ్రహించాలి? సమస్యలను ఎలా అధిగమించాలి తదితర అంశాలను కూలంకషంగా వివరించేవారు. నెహ్రూ నింపిన ఉత్సాహం, ధైర్యంతోనే ఇందిర ‘ఉక్కు మహిళ’గా రూపొందారు. ప్రధానిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపారు. తన కుమార్తె ఇందిరకు నెహ్రు రాసిన ఉత్తరాలు నేటి తరానికి పాఠాలయ్యాయి. ఆయన చెప్పిన ఆ మంచి మాటలు మనం ఎప్పటికీ ఆచరించదగినవే.పిల్లలకు కూడా పండిట్‌ ‌నెహ్రూ అంటే వల్లమానిన ప్రేమ. ఆయనను, ముద్దుగా ‘చాచా నెహ్రూ’, ‘చాచాజీ’ అని పిలుచుకుంటారు. ఇష్టమైన మేనమామ/ బాబాయి అని దీని అర్థం. 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ఆయన పుట్టిన రోజును ‘బాలల దినోత్సవం’గా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. నాటి నుంచి నవంబర్‌ 14‌ను ‘చిల్డ్రన్స్ ‌డే’గా జరుపుకొంటున్నాం. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజున తపాలా బిళ్లను విడుదల చేస్తుంది.

వివిధ దేశాల్లో బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశం ఒక్కో రోజున జరుపుకుంటుంది. చైనాలో జూన్‌ 1‌వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటారు. శుభాకాంక్షలు చెప్పుకుని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోజు పాఠశాలలు తెరిచి ఉన్నా తరగతులు జరగవు. పాకిస్తాన్లో నవంబర్‌ 20‌వ తేదీన బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజున పాఠశాలలు మామూలుగానే పని చేస్తాయి. టీవీలు, రేడియోల్లో మాత్రం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. జపాన్లో మే 5న జరుపుకుంటారు. ఆరోజున మగపిల్లలున్న వారు చేప ఆకారంలో ఉన్న గాలిపటాలను ఎగురవేస్తారు. అంతే కాక యుద్ధవీరుల బొమ్మలతో కొలువు ఏర్పాటుచేస్తారు. ఆరోజు జాతీయ సెలవుదినంగా కూడా ప్రకటిస్తారు. దక్షిణ కొరియాలో మే 5వ తేదీన బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజున ఇక్కడ పిల్లలకోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారు ఎప్పుడూ గుర్తుంచుకునేలా పెద్దలు పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తారు. పోలాండ్లో జూన్‌ 1‌న జరుపుకుంటారు. ఆ రోజున స్కూళ్లల్లోనే రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. పార్కుల్లో, వినోద కేంద్రాలలో పిల్లలకోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. శ్రీలంకలో అక్టోబర్‌ 1 అం‌టే పండుగే. పెద్దలు తప్పనిసరిగా వారిని బయటకు తీసుకెళ్తారు. ఇళ్లల్లో వారికోసం ప్రత్యేకంగా స్వీట్లు చేస్తారు.2019 నేషనల్‌ ‌క్రైమ్రికార్డ్ ‌బ్యూరో గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా జైళ్లలో 4,78,600 మంది ఖైదీలు ఉండగా.. వారిలో 19,913 మంది మహిళా ఖైదీలు. 1,300 జైళ్లలో 31 శాతం ఉన్న మహిళా జైళ్లలో 4 వేల మంది ఉన్నారు. వారిలో 1,543 మంది మహిళా ఖైదీలు పిల్లలను తమ వద్దే ఉంచుకుంటున్నారు. వారితోపాటుగా దేశవ్యాప్తంగా జైళ్లలో తల్లుల వద్ద ఉంటున్న పిల్లల సంఖ్య 1,779. తెలంగాణలో శిక్ష పడినవారు, అండర్‌ ‌ట్రయల్‌, ‌డిటెన్యూ తదితర అన్నిరకాలకు సంబంధించి 6,717 మంది ఖైదీలు వివిధ జైళ్లలో ఉండగా.. అందులో 445 మంది మహిళా ఖైదీలున్నారు. చంచల్గూడలోని ప్రత్యేక మహిళా జైలులో 222 మంది ఉన్నారు. 31 మంది మహిళా ఖైదీలు 34 మంది పిల్లలతోసహా ఉంటున్నారు. అందులో చంచల్గూడ ఉమెన్‌ ‌జైలులో 11 మంది పిల్లలున్నారు.

డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply