Take a fresh look at your lifestyle.

బాల కార్మికులు.. ఆధునిక సమాజానికి శ్రేయస్కరం కాదు

“బాల కార్మికులు ఎక్కవగా ఈ క్రింద పేర్కొన్న పనులలో గుర్తించటం జరిగింది. మైనింగ్‌, ‌వ్యభిచారం, డ్రగ్స్, ‌మత్తుపానీయాలు, భారీ కర్మాగారాలు, దినపత్రికల అమ్మకం, బానిసలుగా, బాండెడ్‌ ‌లేబర్‌, ‌పోర్నోగ్రఫీ• మొదలగు పనులలో ఉండటం భవిష్యత్‌ ‌తరాలకు ప్రమాద సంకేతంగ చెప్పవచ్చు. ఈ బాల కార్మిక సమస్యకు అనే కారణాలుండగా ప్రధానమైనవి : పేదరికం, అపరిమిత జనాభ, తల్లిదండ్రుల నిరక్షరాస్యత, పెరుగుతున్న జీవనవ్యయం, బలహీన చట్టాలు, పట్టణీకరణ, నిర్లక్ష్యం, అవగాహన లేమి, ఇలా కరుణిడి చావుకు లక్ష కారణాలన్నట్టు అనేక కారకాలు చిన్న పిల్లలను కార్మికులుగా మారుస్తున్నాయని చెప్పవచ్చు.”

ఇప్పుడున్న కొవిడ్‌ 19 ‌పరిస్థితులలో ఈ సంఖ్య ఇంకా పెరిగే ఆస్కారం ఉందని చెప్పవచ్చు. మరీదిగువ స్థాయి కుటుంబాలు లాక్‌డౌన్‌ ‌కాలంలో ఉపాధి కోల్పోవడం, ఎక్కువ శాతం దినసరి కూలీలుగా ఉండటంతో వారి ఆర్థిక అవసరాల కోసం వారి పిల్లలను కూడా ఏదో ఒక పనిలో పెట్టి బ్రతుకు బండిని లాగే అవకాశం ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికత, సమాచార వ్యవస్థ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న తరుణంలో బాలకార్మికులు అనే సమస్య ప్రపంచాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ సమస్య విశ్వవ్యాప్తంగా మానవహక్కులకు ఒక ప్రతిబంధకంగా మారిందని చెప్పవచ్చు. ఇంటర్నేషనన్‌ ‌లేబర్‌ఆర్గనైజషన్‌ ‌ప్రకారం ‘‘ఏ పనులైతే బాలల బాల్యాన్ని మరియు వారి గౌరవాన్ని, శారీరక, మానసిక వృద్ధిని చిదిమేస్తాయో అటువంటి పనులలో 14 సంవత్సరాలలోపు పిల్లలను ఉపయోగించినట్లయితే వారిని బాలకార్మికులుగా పేర్కొంది.నేటి బాలలే రేపటి పౌరులు అన్న విషయం మొత్తం సమాజం గుర్తుంచుకొని అట్టి బాలలను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికై రేపటి పౌరులను వారిబాల్యాన్ని మంచి వాతావరణంలో గడపడానికి, వారి శారీరక మరియు మానసిక వికాసాన్ని పెంపొందించుకునే అవకాశం కల్పించే బాధ్యత సభ్యసమాజంపై ఎంతైనా ఉంది.

గణాంకాలు ఎం చెబుతున్నాయి.?
గణాంకాలను పరిశీలించినట్లయితే దాదాపు 200 మిలియన్ల కంటే ఎక్కువ సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా వివిధ• పనులలో బాల కార్మికులున్నట్లు అంచనా. అందులో 120 మిలియన్‌ల పిల్లలు, ప్రమాదకరమైన పనులు చేస్తుండగా, ఇందులో 73 మిలియన్‌ ‌బాలలు పది సంవత్సరాలలోపే ఉండటం గమనార్హం. విశ్లేషణల ప్రకారం, అత్యధిక బాల కార్మికులు ఉపసహారన్‌ ఆ‌ఫ్రికాలో నమోదు కావడం జరిగింది. గత పది సంవత్సరాల గణాంకాలను పరిశీలించినట్లయితే సుమారు 3 లక్షల బాలకార్మికులు సాయుధ పోరాటాలలో గుర్తింపబడ్డారు. బాలకార్మికులు ఎక్కువగా వినియోగ వస్తువుల ఉత్పత్తులైన కాఫీ, పత్తి, రబ్బర్‌, ‌కోక్లాంటి వాటికి సంబంధించిన పనులలో ఉన్నారని విశ్లేషకుల అంచనా. కొంత మంది పిల్లలు వస్త్ర తయారీ, ఆట వస్తువుల తయారి, అగ్గి పుల్లల తయారి, సిగరెట్‌ ‌తయారి పరిశ్రమలలో పని చేస్తూ వారి బాల్యాన్ని మరియు ఆరోగ్యాన్ని చిదిమేసుకోవడం జరుగుతుంది.

ఒక సర్వే ప్రకారం 152 మిలియన్‌ ‌పిల్లలు 5 నుంచి 11 సంవత్సరాలలోపు, 42 మిల్లియన్‌ ‌పిల్లలు 12 నుంచి 14 సంవత్సరాలలోపు మరియు 37 మిలియన్‌ ‌పిల్లలు 15 నుంచి 17 సంవత్సరాలలోపు ఉన్నారు.ఈ 152 మిలియన్‌ ‌పిల్లల్లో 88 మిలియన్‌ల బాలురు మరియు 64 మిలియన్ల బాలికలు ఉన్నట్లు తేలింది. ప్రాథమికంగా బాలకార్మికులను వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో(అటవి, చేపలపెంపకం, ఆక్వాకల్చర్‌) 71 ‌శాతం వుండగ, 17 శాతంసేవారంగంలో , మరియు 12% గపారిశ్రామిక రంగాలలో గుర్తించటం జరిగింది. బాల కార్మికులు ఎక్కవగా ఈ క్రింద పేర్కొన్న పనులలో గుర్తించటం జరిగింది. మైనింగ్‌, ‌వ్యభిచారం, డ్రగ్స్, ‌మత్తుపానీయాలు, భారీ కర్మాగారాలు, దినపత్రికల అమ్మకం, బానిసలుగా, బాండెడ్‌ ‌లేబర్‌, ‌పోర్నోగ్రఫీ• మొదలగు పనులలో ఉండటం భవిష్యత్‌ ‌తరాలకు ప్రమాద సంకేతంగ చెప్పవచ్చు. ఈ బాల కార్మిక సమస్యకు అనే కారణాలుండగా ప్రధానమైనవి : పేదరికం, అపరిమిత జనాభ, తల్లిదండ్రుల నిరక్షరాస్యత, పెరుగుతున్న జీవనవ్యయం, బలహీన చట్టాలు, పట్టణీకరణ, నిర్లక్ష్యం, అవగాహన లేమి, ఇలా కరుణిడి చావుకు లక్ష కారణాలన్నట్టు అనేక కారకాలు చిన్న పిల్లలను కార్మికులుగా మారుస్తున్నాయని చెప్పవచ్చు.

చైల్డ్ ‌లేబర్‌ (‌ప్రొహిబిషన్‌ ‌మరియు రేగులేషన్‌) ఆక్ట్ 1986 ఎం ‌చెబుతుంది.
ఈ చట్టం ప్రకారం 15 సంవత్సరాలలోపు పిల్లలను రవాణా, ఆటోమొబైల్స్, ‌హ్యాండ్లూమ్స్, ‌మైన్స్, ‌డ్రైవింగ్‌, ‌సర్కస్‌, ‌బీడీ మేకింగ్‌, ‌సిమెంట్‌ ‌తయారీ, డైయింగ్‌, ‌జ్యూట్‌, ‌డిటర్జెంట్‌, ‌సిమెంట్‌ ‌పైప్స్, ‌గ్లాస్‌ , ‌కాటన్‌ ‌జిమ్మింగ్‌, ‌ప్రింటింగ్‌, ‌పేపర్‌ ‌మేకింగ్‌, ‌కోల్‌ ‌బర్నింగ్‌, ‌వేర్‌హౌస్‌, ‌ఫుడ్‌ ‌ప్రొసెసింగ్‌, ‌డైమండ్‌ ‌కట్టింగ్‌, ‌సామిల్‌, ‌పొగాకు మొదులగు 15 సంవత్సరాలలోపు పిల్లలకు ఉపాధి కల్పించడం చట్టరీత్యా నేరం. ఎక్కడైతే బాలకార్మికులు పనిచేయడానికి అనుమతి ఉంటుందో, అక్కడ వీరితో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8గంటలలోపు పని చేయించ రాదు. మరియు 3 గంటలకంటే ఎక్కువ నిర్విరామంగా పనిచేయించ రాదు.వారాంతపు సెలవు మంజూరు చేయడమే కాకుండా, పని చేసే ప్రదేశంలో పరిశుభ్రత, వెంటిలేషన్‌, ‌లైటింగ్‌, ‌త్రాగునీరు, మరుగుదొడ్లు, ఫైర్‌‌ప్రొటెక్షన్‌, ‌ప్రథమ చికిత్స సామాగ్రి లాంటి సౌకర్యాలు విధిగా ఉండేలా సంబంధిత యాజమాన్యాలు చూసుకోవాలి. ఏది ఏమైనప్పటికి, ఈ బాలకార్మికుల సమస్య 2000 సంవత్సరం నుంచి 30 % వరకు తగ్గినప్పటికి, నేటికి ఇంకా 100 మిలియన్ల బాలకార్మికులు ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమలలో ఉన్నారనే చెప్పవచ్చు.

ఇప్పుడున్న కొవిడ్‌ 19 ‌పరిస్థితులలో ఈ సంఖ్య ఇంకా పెరిగే ఆస్కారం ఉందని చెప్పవచ్చు. మరీదిగువ స్థాయి కుటుంబాలు లాక్‌డౌన్‌ ‌కాలంలో ఉపాధి కోల్పోవడం, ఎక్కువ శాతం దినసరి కూలీలుగా ఉండటంతో వారి ఆర్థిక అవసరాల కోసం వారి పిల్లలను కూడా ఏదో ఒక పనిలో పెట్టి బ్రతుకు బండిని లాగే అవకాశం ఉంది. అయితే ఈ బాలకార్మికుల సమస్యకు ఎక్కడో ఒకచోట ముగింపు పలుకపోతే, భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక, సాంఘీక, పరిస్థితులు ప్రమాదంలో పడటమే కాకుండా అసాంఘిక కార్యకలాపాలైన దొంగతనం, దోపిడీ, హింస, దౌర్జన్యాలు, లాంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కావున ఈ సమస్య నిర్మూలనను మనమంతా బాధ్యతగా తీసుకొని మన పరిసరాలలో ఇటువంటి పిల్లలు ఉంటే కౌన్సిలింగ్‌ ఇవ్వటం, చట్టం దృష్టికి తీసుకెళ్లడం, అవగాహన సదస్సులు నిర్వహిం చడం మూలాన త్వరలోనే ఈ సమస్యకు చరమగీతం పాడవచ్చు.

md
డా।। ఎండి ఖ్వాజామొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫై•నాన్స్

Leave a Reply