Take a fresh look at your lifestyle.

చీకటమ్మ చాలా నేర్పింది!

ఒక్కోసారి చీకటిలో ఉంటేనే
బాగుండును అని అనిపిస్తుంది!
వెలుగు దివ్వెకై పోరాటం,
వేకువ దిశగా ఆరాటం తప్ప
ఇంకోటి ఉండదు అక్కడ!

వెలుతురు వస్తూనే
ఆశలు, ఆడియాశలు!
అనుమానాలు, అవమానాలు!
అసూయలు, ఆగ్రహాలు!

బహుశా ఇవన్నీ తట్టుకోవాలనేమో
చూడలేని లక్షాన్ని
ఆసరా ఇవ్వని స్నేహాన్ని!
నిండుకుండెడు నైరాశ్యాన్ని,
తలుపుతట్టని అదృష్టాన్ని!
కలిసిరాని కాలాన్ని,
ఎత్తి పొడిచే మనుష్యులను,
ఎదురు వచ్చే ఆటంకాలను!
కాలి క్రింద గోతులను
రాలిపోయే ఆశయాలను!
జారిపోయి అవకాశాలను,
చీకటమ్మ చాలా చూపింది!

చిక్కగా ఉండమంది
చిమ్మగా ఉంచేసింది!
నిజాలను చూడమంది
నిర్భయాన్ని నేర్వమంది!
చీకటమ్మ చాలా నేర్పింది!
నాకు నన్ను పరిచయం చేసింది,
నన్ను నన్నుగా గుర్తెరగమంది!
చీకటమ్మ చాలా నేర్పింది!

ఉషారం
9553875577

Leave a Reply