Take a fresh look at your lifestyle.

‌ప్రజాతంత్ర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన చీఫ్‌ ‌విప్‌

Warangal Western MLA Dasan Vinaybhaskar
‌ప్రజాతంత్ర క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న చీఫ్‌ ‌విప్‌ ‌వినయ్‌భాస్కర్‌

సుబేదారి: నిజాలను నిక్కచ్చిగా చెప్పే ప్రజాతంత్ర దినపత్రిక మరింత అభివృద్ధి చెందిన ప్రజాసమస్యలపై స్పందించాలని ప్రభుత్వ చీఫ్‌ ‌విప్‌, ‌వరంగల్‌ ‌పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. ప్రజాతంత్ర దినపత్రిక రూపొందించిన 2020 క్యాలెండర్‌ను బుధవారం హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంప్‌ ‌కార్యాలయంలో చీఫ్‌ ‌విప్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని, అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ గత 20 సంవత్సరాలుగా పత్రిక ప్రజల మనసులను దోచుకుందన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పేదల పక్షపాతియని, అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. తాగు, సాగునీటి కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో విద్యుత్‌ ‌కొరత లేకుండా చేశాడని అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా కాజీపేట రైల్వేస్టేషన్‌ ‌సమీపంలోని పేదలకు దుప్పట్లను, ఆహార పదార్థాలను చీఫ్‌ ‌విప్‌ అం‌దజేశారు. క్యాలెండర్‌ ఆవిష్కరణలో ప్రజాతంత్ర జర్నలిస్టులు నిమ్మటూరి శ్రీనివాస్‌శర్మ, ఎన్‌.‌బుచ్చిరెడ్డి, ఆదిరెడ్డి, కిరణ్‌రెడ్డి, బెలిదె శ్రీనివాస్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌నాయకులు పులి రజినీకాంత్‌, ‌నయిమొద్దీన్‌, ‌బుర్ర దేవేందర్‌,  ‌తదితరులు పాల్గొన్నారు.

Tags: Chief Minister KCR, ‌partisan,  many welfare schemes, ‌ Warangal Western MLA Dasan Vinay bhaskar

Leave a Reply