Take a fresh look at your lifestyle.

సిఏఏకు వ్యతిరేకo

‘‘మనదేశానికి ఫెడరల్‌ ‌విధానమే శ్రీ రామ రక్ష అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిశ్చితాభిప్రాయాన్ని ప్రకటించారు. కేంద్ర ఆర్థివ విధానాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలను తూర్పారాపట్టారు. మున్సిపల్‌, ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్‌లో మాట్లాడారు. ఐకేపీ ఉద్యోగులకు, రాష్ట్ర ఉద్యోగులకు వరాల వర్షం కురిపించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న భావసారూప్యతకలిగిన ప్రాంతీయ పార్టీలు, ముఖ్యమంత్రులతో సదస్సును ఏర్పాటు చేస్తామని, బహిరంగ సభ నిర్వహిస్తామని స్పష్టం చేసారు. ప్రజలకు వ్యతిరేకంగాఉండే ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నిస్తామని, కుండ బద్దలు కొట్టినట్లు విమర్శించి తీరుతామని హెచ్చరించారు. బీజీపీ, కాంగ్రెస్‌ ‌పార్టీలపై విమర్శనాస్త్రాలను సంధించారు.భవిష్యత్‌లో జాతీయస్థాయిలో ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ‌ప్రభుత్వాలు ఏర్పడతాయని రాజకీయ జోక్యం చెప్పారు.‘‘

 • 10 లక్షల మందితో బహిరంగ సభ
 • 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం
 • మున్సిపల్‌ ఎన్నికలలో అఖండ విజయం మా పనితనానికి నిదర్శనం: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు
 • కలసివచ్చే ముఖ్యమంత్రులతో సదస్సు, భారీ బహిరంగ సభ
 • కేంద్ర విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు
 •  ఐకేపీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌
 • ‌రైతు సమన్వయ సమితి బలోపేతం
 •  త్వరలో పట్టణ ప్రగతి కార్యాచరణ
 • గల్ఫ్ ‌దేశాలలో పర్యటించి కొత్త ఎన్‌ఆర్‌ఐ ‌విధానం రూపకల్పన
 • త్వరలో కొత్త రెవెన్యూ చట్టం ఉద్యోగులకు పీఆర్సీ
 • మున్సిపల్‌ ఎన్నికలలో అఖండ విజయం మా పనితనానికి నిదర్శనం  : సీఎం కేసీఆర్‌  

Farmers, Farmers Insurance, 24-hour electricity supply, mission bhagithara, etcప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌మన దేశానికి ఫెడరల్‌ ‌విధానమే శ్రీరామ రక్ష అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు ప్రకటించారు. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య అనే విషయాన్ని మరచిపోకూడదనీ పేర్కొన్నారు. రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలు రాజ్యాంగబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలనీ, వాటికి రాజ్యాంగం ప్రకారం స్పష్టంగా, నిర్దిష్టంగా హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ బిల్లును కుండబద్దలు కొట్టినట్లు వ్యతిరేకిస్తున్నామనీ, ఇందులో ఎటువంటి సందేహం లేదని టీఆర్‌ఎస్‌ ‌విధానాన్ని ప్రకటించారు. కేంద్రం రూపొందించిన జాతీయ పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో పది లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని వెల్లడించారు. భవిష్యత్తులో ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ‌కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు. జాతీయ పార్టీలకు కాలం చెల్లిందనీ, భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. కేంద్రం ముస్లింలను మాత్రమే పక్కనబెట్టి రూపొందించిన బిల్లుకు వ్యతిరేకంగా భావసారూప్యత కలిగిన ప్రాంతీయ పార్టీలు, ముఖ్యమంత్రులతో హైదరాబాద్‌లో సదస్సును నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు వసూలు చేసేందుకు అవసరమైన ఢిల్లీలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తామన్నారు. శనివారం మున్సిపల్‌ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ‌విజయఢంకా మొగించిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర రాజకీయాలను, ఆర్థిక విధానాలను, ముస్లిం వ్యతిరేకతను తూర్పారపట్టారు.మున్సిపల్‌ ఎన్నికలలో గొప్ప విజయం సాధించినందుకు టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు గర్వపడవద్దనీ, పొగరు రావొద్దని హితవు చెప్పారు. ప్రజలు తమకు కావాల్సిన సేవకులను ఎన్నుకున్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు.

కొత్తగా ఎన్నికయ్యే మేయర్లు, మున్సిపల్‌ ‌చైర్మన్లు ఇతర పాలక మండలి సభ్యులతో త్వరలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని కార్యాచరణ ప్రకటించారు. పల్లె ప్రగతి మాదిరిగానే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామనీ, మున్సిపాలిటీల ఆదాయ వనరులకు అనుగుణంగా రూ. 2 వేల కోట్లు తక్కువ కాకుండా ప్రతీ మునిసిపాలిటీకి ప్రతీ నెలా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పట్టణాల ప్రతిని అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌లో 20 ఎకరాలలో అర్బన్‌ ఎక్సలెన్స్ ‌సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ ‌మేనిఫెస్టోలో రూపొందించిన హామీలను అమలు చేయలేక పోయిన పరిస్థితులను వివరించారు. మార్చి 31 నుంచి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వారందరికీ 57 సంవత్సరాలు నిండిన వారందరికీ నెలకు రూ. 2116 చొప్పున వృద్ధాప్య పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ భృతి విషయంలో కూడా ఆలోచనలు చేస్తున్నామనీ, విధానాలను రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందనీ, ప్రపంచంలోనే అత్యధికంగా కంటి పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభించిందని ఎల్వీ ప్రసాద్‌ ‌కంటి ఆసుపత్రి అధ్యక్షుడు డా.జీఎన్‌ ‌రావు చెప్పిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా మనరాష్ట్రం పైన కూడా ప్రభావం చూపుతున్నదనీ, 21 శాతానికి చేరిన ఆర్థిక ప్రగతి రేటు ప్రస్తుతం 9జ1 శాతానికి తగ్గిపోయిందనీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు. ఉద్యోగులకు తృణమో, పణమో పెంచుతామనీ, వారి పదవీ విరమణ వయసు పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్‌ ‌సెషన్‌లో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామనీ, తప్పనిసరిగా దానిని అమలు చేసి తీరతామని స్పష్టం చేశారు.

జాతీయ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నాం
భారత దేశం ప్రజల దేశమనీ, ఇది ఏ మతం, కులానికి చెందినది కాదనీ మెజార్టీ భారత ప్రజల పక్షాననే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ పౌరసత్వ బిల్లు, జాతీయ పౌరపట్టిక విషయంలో కేంద్ర మంత్రులే పరస్పర విరుద్ధ ప్రకటనలుచేస్తున్నారనీ, ఇదేం విధానమని ప్రశ్నించారు. ఎన్‌ఆర్‌సిని అన్ని వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రకటించడానికి విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో తె)ంగాణ ప్రజలకు ఏమని పిలుపునివ్వాలో చెప్పాలని ప్రశ్నించారు.జాతీయ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్త వచ్చే బడ్జెట్‌ ‌శాసనసభలో తీర్మానం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ బిల్లు కారణంగా దేశ ప్రతిష్టలు దిగజారిపోయాయనీ, అంతర్జాతీయ మార్కెట్‌లో దేశాన్ని అగౌరవంగా చిన్నచూపు చూస్తున్నారు. ఈ బిల్లు రాజ్యాంగ పీఠికలో పొందుపరచిన అంశాలకే వ్యతిరేకమని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తప్పనిసరిగా ఈ చట్టాన్ని కొట్టి వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లు ప్రజల మధ్య బేధ భావాలను సృష్టిస్తుందనీ, టీఆర్‌ఎస్‌ ‌పార్టీ నూటికి నూరు శాతం సెక్యులర్‌ ‌పార్టీ అనీ, తమ సిద్ధాంత భూమిక నుంచే జాతీయ పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఎన్నికలలో గెలిచినా ఓడినా పార్టీ విధానంలో మార్పు ఉండదని చెప్పారు. ఈ అంశాలన్నింటినీ దేశంలోని 15 నుంచి 16 మంది ముఖ్యమంత్రులు ఆలోచనలు చేస్తున్నారనీ, వీరందరితో హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేశ ప్రజల మంచినీటి, సాగునీటి, ఆర్థిక అసమానతలు, ఆర్థిక మాంద్యం, విద్య వంటి కీలక అంశాలపై శ్రద్ధ వహించకుండా ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నదని ఆరోపించారు. మత కల్లోలాలు సృష్టించడం శవాల మీద పేలాలు ఏరుకోవడమేనని పేర్కొన్నారు. కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ‌ను రద్దు చేయడాన్ని సమర్థించిన సీఎం కేసీఆర్‌ ‌కాశ్మీర్‌ ‌దేశంలో అంతర్భాగమనీ, దేశ సమగ్రత దృష్ట్యా 370 రద్దును సమర్థించామనీ, తద్వారా దేశ గౌరవం పెరిగిందని ఆయన అన్నారు.

కేంద్ర ఆర్థిక విధానాలతో జీడీపీ గణనీయంగా తగ్గింది
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా జీడీపీ 6.1 నుంచి 0కు వచ్చే దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడుతున్నదనీ, దీంతో రాష్ట్రాలన్నీ ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయనీ, ఇది దేశానికి క్షేమకరం కాదని ఆయన అన్నారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలు రూ. 1131 కోట్లు ఆగిపోయాయనీ, ఐజీఎస్టీ బకాయిలు రూ.2012 కోట్లకు చేరాయని తెలిపారు. ఈ నిధులను కేంద్రం ఇస్తుందా ఎగవేస్తరా అనేది తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఈ కారణా)తో ఉద్యోగులకు వారు ఆశించిన విధంగా పీఆర్‌సి ఇచ్చే పరిస్థితులు లేవనీ, అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తృణమో, పణమో పెంచుతామని స్పష్టం చేశారు.
మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ప్రజలు మార్గదర్శనం చేశారు.

మున్సిపల్‌ ఎన్నికలలో ప్రతిపక్షాలను ప్రజలు తిరస్కరించారని టీఆర్‌ఎస్‌ను గొప్పగా ఆదరించారని హర్షం ప్రకటించారు. ఈ విజయం ద్వారా ప్రజలు మాకు మార్గదర్శనం చేశారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌కు శుభాశీస్సులు అందించారు. మండలం, జిల్లా, రాష్ట్రంలోని కార్యకర్తలు, మంత్రులు, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులందరూ కలసికట్టుగా అత్యద్భుతంగా పనిచేశారనీ వారందరినీ అభినందించారు. ప్రజలు ప్రతిపక్షాలను తిరగేసి కొట్టారనీ, దేశ చరిత్రలో ఏ పార్టీకి కూడా ఇలాంటి అఖండ విజయం వచ్చిన దాఖలాలు లేవనీ, తెలంగాణ ప్రజలు తమను నిర్దేశించుకున్న లక్ష్యంపైపు ప్రయాణించమని ఆశీర్వదించారని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలను నిలిపివేయాలని కోర్టులకు వెళ్లి ప్రతిపక్షాలు అభాసుపాలయ్యాయని అన్నారు. ఈ ఎన్నికలలో ప్రతిపక్షాలు ఉపయోగించిన భాషపై కూడా కేసీఆర్‌ ‌హెచ్చరికలు చేశారు. వ్యక్తిగత దూషణలు, విమర్శలు రాజకీయాలలో మంచివి కావని హితవు పలికారు.రాజకీయ నాయకత్వం, రాజకీయ వ్యవస్థ బాధ్యతగా ఉండాలనీ, మర్యాద సంస్కారం మరచిపోవద్దని ముక్కు కోస్తా వంటి భాషను ఉపయోగించవద్దని పరోక్షంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను హెచ్చరించారు. రాజకీయ నాయకులు, స్థాయిని, హోదాను మరచిపోయి అవాకులు చెవాకులు పేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సద్విమర్శలను గౌరవంగా ఆహ్వానిస్తామన్నారు. ఈ ఎన్నికలలో రూ. 80 లక్షల విలువైన పార్టీ సామాగ్రిని మాత్రమే కార్యకర్తలు,నాయకులకు పంపించామనీ, ప్రతిపక్షాలు మాత్రం రూ.వేల కోట్లు పంపిణీ చేస్తున్నట్లు పిచ్చికూతలు కూస్తున్నారని విమర్శించారు. ఈ మాటల ద్వారాతెలంగాణప్రజలను అవమానపరుస్తున్నారనీ, అంటే తెలంగాణ ప్రజలు అమ్ముడు పోయారని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. పట్టణాలలో పెరుగుతున్న కాలుష్యం ప్రభుత్వాలకు సవాలుగా పరిణమించిందని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారు. పట్టణీకరణ పెరిగిపోతుందనీ, పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయనీ, దీంతో పట్టణాలలో చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. చుట్టూ సముద్రతీరం ఉన్న పట్టణాలలో కాలుష్యం తక్కువగా ఉంటున్నదనీ, మెల్‌బోర్న్, ‌సిడ్నీలలో ఈ కారణంతోనే కాలుష్యాన్ని తగ్గించుకోగలుగుతున్నారనీ, ముంబై, చెన్నైలలో కాలుష్యం తక్కువగా ఉన్నదనీ, ఢిల్లీలో ఇది విపరీతమైన స్థాయిలో ఉందన్నారు. హైదరాబాద్‌ ‌చుట్టూ లక్షా 50 వేల ఎకరాల అటవీ భూమి ఉన్నందుననే కొంతమేర కాలుష్యం తక్కువగా ఉందనీ, దీనిని పూర్తిగా నివారించేందకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు. నగరాలకు ఏటా 5 నుంచి 6 లక్షల మంది వస్తున్నారనీ, దీంతో ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ సమస్యలు వస్తున్నాయని తెలిపారు.

అర్బన్‌ ఎక్సలెన్సీ సెంటర్‌
‌సెంటర్‌ ‌ఫర్‌ అర్బన్‌ ఎక్సలెన్స్ ‌మహా నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ అధ్యయన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 20 ఎకరాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేస్తామనీ, ఇక్కడ నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారాలు సూచిస్తారని చెప్పారు.

ఎన్‌ఆర్‌ఐ ‌పాలసీ
కరీంనగర్‌, ‌సిరిసిల్ల ప్రాంతాల నుంచి దుబాయ్‌ ‌వంటి దూర దేశాలకు వెళ్లి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, దీనినినియంత్రించేందుకు ఎన్‌ఆర్‌ఐ ‌పాలసీని రూపొందించనున్నట్లు వెల్లడించారు. తానే స్వయంగా గల్ఫ్ ‌దేశాలలో పర్యటించి వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉత్తరతెలంగాణ జిల్లాల నుంచి 16 మంది ఎమ్మెల్యేలు, 3 మంత్రులు ప్రాతినిద్యం కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో భవన నిర్మాణ రంగంలో ఆదాయ వనరులు ఉన్నాయనీ, వీటిని ఉపయోగించుకకుండా యువకులు గల్ఫ్ ‌దేశాల బాట ఎందుకు పడుతున్నారో అర్థం కావటం లేదని ఈ సందర్భంగా కేసీఆర్‌ ‌వ్యాఖ్యానించారు.

Tags: NRI Policy,Urban Excellence Center,GDP rate, significantly reduced, central economic policies

Leave A Reply

Your email address will not be published.