అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్థం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందులో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో నోరూరించే అరుదైన విందు జరుగనుంది. కాకలు తీరిన రాజకీయ యోధుడు బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి సీనియర్ల వరుసలో మన ముఖ్యమంత్రికి గౌరవ ప్రాతినిధ్యం లభించింది.
కాగా, ఈ విందులో ఆస్సాం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్, హర్యాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, తమిళనాడు సీఎం పళనిస్వామి, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ విందులో పాల్గొంటారు. దక్షిణ భారత దేశం నుంచి పళని స్వామికి ప్రాతినిధ్యం లభించినప్పటికీ తెలంగాణ సీఎకు ఈ అద్బుత అవకాశం రావడం గమనించాల్సిన అంశం. కేసీఆర్‌ను రాష్ట్రపతి విందుకు పిలవడం బీజేపీలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తున్నది.