Take a fresh look at your lifestyle.

డా.పొత్తూరి మృతికి ముఖ్య మంత్రి కె సీ ఆర్ సంతాపం

సీనియర్ జర్నలిస్టు శ్రీ పొత్తూరి వేంకటేశ్వర రావు మృతిపట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషిని, అందించిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు అందించిన నైతిక మద్దతును సీఎం గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. వేంకటేశ్వర రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Leave a Reply