ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో కేసీఆర్ చర్చించారని తెలుస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌పై చర్చించిన్నట్లు సమాచారం. పలు అంశాల పరిష్కారానికి సంబంధించి వినతి పత్రాలు సమర్పించారు.
ఈ నెల 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. గురువారం మధ్యాహ్నం వసంత్ విహార్‌లో తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే శనివారం కూడా సిఎం ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. హోమ్ మంత్రి అమిత్‌షాను కలిసే అవకాశం ఉంది.