Take a fresh look at your lifestyle.

విధుల్లో నిబద్ధతకు హోంగార్డుకు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌ప్రశంస

కారు ఆపి పుష్పగుఛ్చంతో అభినందన
ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 8 : ‌తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్‌ ‌హోంగార్డ్‌కు ఊహించని సత్కారం లభించింది. సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌తన వాహనాన్ని ఆపి..ఆ హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ఈ ఊహించని సన్మాన కార్యక్రమం అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌విగ్రహం వద్ద శుక్రవారం ఉదయం ఆవిష్కృతమైంది. చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్ర శర్మ ప్రతి రోజు తన అధికారిక నివాసం నుంచి హైకోర్టుకు అబిడ్స్ ‌వి•దుగా వెళ్తుంటారు.

ఆ సమయంలో అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌విగ్రహం వద్ద ట్రాఫిక్‌ ‌హోంగార్డ్ అ‌ష్రఫ్‌ అలీ(5066, అబిడ్స్ ‌పీఎస్‌) ‌విధులు నిర్వర్తిస్తుంటాడు. అష్రఫ్‌ ‌తన విధులను చిత్తశుద్ధితో నిర్వహించడాన్ని చీఫ్‌ ‌జస్టిస్‌ ‌ప్రతి రోజు గమనించే వారు. ఈ క్రమంలో అతని పనితీరు పట్ల ఆకర్షితులైన సీజే సతీశ్‌ ‌చంద్ర శర్మ.. శుక్రవారం ఉదయం తన కాన్వాయ్‌ను బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌విగ్రహం వద్ద ఆపారు. హోంగార్డ్ అ‌ష్రఫ్‌ అలీకి పుష్పగుచ్ఛం అందించి, అభినందించారు. అష్రఫ్‌ అలీ పనితీరును మెచ్చుకుంటూ హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌ప్రశంసలు కురిపించారు.

Leave a Reply