Take a fresh look at your lifestyle.

తెలంగాణ హైకోర్టు జడ్జిగా విజయసేన్‌ ‌రెడ్డి ప్రమాణం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌

‌తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా విజయసేన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం హైకోర్టు ప్రాంగణంలో చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రాఘవేంద్ర సింగ్‌ ‌చౌహన్‌ ‌చేతుల దుగా న్యాయమూర్తి విజయ సేన్‌ ‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారమ•త్సవానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. శనివారం ఉదయం 11.30 గంటలకు హైకోర్టు ప్రాంగణంలో చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రాఘవేంద్ర సింగ్‌ ‌చౌహన్‌ ‌చేతుల దుగా న్యాయమూర్తి విజయసేన్‌ ‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార మ•త్సవానికి పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.

విజయసేన్‌ ‌రెడ్డి నియామకంతో హైకోర్టు జడ్జిల సంఖ్య 14కు చేరింది. విజయసేన్‌ ‌రెడ్డి 1970 ఆగస్టు 22న హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి జస్టిస్‌ ‌బి.సుభాషణ్‌రెడ్డి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా, మద్రాసు, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా, ఉమ్మడి రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్‌ ‌ఛైర్మన్‌గా, లోకాయుక్తగా సేవలందించారు. 1994 డిసెంబరులో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాజ్యాంగ, సివిల్‌, ‌క్రిమినల్‌, ‌సర్వీసు, భూసేకరణ, ఆర్బిట్రేషన్‌, ‌పౌరసరఫరాలకు చెందిన కేసులను వాదించారు.

Leave a Reply