చైనా బలగాలు మన భూభాగంలోకి చొరబడకపోతే మన సైనికులు ఎక్కడ చనిపోయారో చెప్పాలని,అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ధ్వజమెత్తారు. భారత సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదన్న మోదీ వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఈ మేరకు శనివారం చిదంబరం స్పందిస్తూ.. ’మోదీ వ్యాఖ్యలు ఇంతకముదు ఆర్మీ చీఫ్, రక్షణ, విదేశాంగ శాఖ మంత్రులు చేసిన ప్రకటనలకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రధాని వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ కలవరపరిచాయి. మే 5,6న చైనా బలగాలు మన భూభాగంలోకి ప్రవేశించకపోతే, మన సైనికులు ఎక్కడ గాయపడ్డారు, ఎందుకు అమరులయ్యారని ప్రశ్నించారు. కాగా భారత భూభాగంలో ఎవరూ ప్రవేశించలేదని శుక్రవారం ప్రధానమంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత్ వైపు కన్నెత్తి చూసిన వారికి సైనికులు గుణపాఠం నేర్పారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఈ నెల 16న గల్వాన్ లోయలో చైనా- భారత్ బలగాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఇక ఇదే విషయంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ప్రధాని వ్యాఖ్యలపై ప్రశ్నలు సంధించారు. చైనా దురాక్రమణకు తలొగ్గిన ప్రధాన భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఆరోపించారు. ఒకవేళ ఆ భూభాగం చైనా వారిది అయితే భారత జవాన్లు ఎందుకు మరణించారని ప్రధానిని ప్రశ్నించారు. ఇకపోతే ఇటీవల గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో దేశంలో చైనా వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రాష్టాల్లో్ర చైనా జెండాలు, చైనా అధ్యక్షుడి్గ లక్సిలను తగులబెడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో చైనా ఉత్పత్తులను కాల్చివేస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా చైనా ఉత్పత్తులను బహిష్కరించి ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం మాత్రం అందరికంటే భిన్నంగా స్పందించారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. మనం తప్పక స్వయం సమృద్ధి సాధించాలని, అదే సమయంలో ఇతర ప్రపంచంతో సంబంధాలు తెగిపోకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. భారత్ చైనా ఉత్పత్తులను బహిష్కరించకుండా గ్లోబల్ సప్లయ్ చెయిన్‌లో భాగస్వామిగా కొనసాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. చైనా ప్రపంచ వాణిజ్యంతో పోల్చితే ఆ దేశానికి భారత్‌తో వాణిజ్యం ఏపాటిదని చిదంబరం ప్రశ్నించారు. కాబట్టి దేశంలో చైనా ఉత్పత్తులను బహిష్కరించినంత మాత్రాన ఆ దేశ ఆర్థికవ్యవస్థకు కలిగే నష్టం పెద్దగా ఏ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చిన్నచిన్న అంశాలను లేవనెత్తి సమయాన్ని వృథా చేయకుండా దేశభద్రత లాంటి ఇతర అంశాల గురించి చర్చ జరుగాల్సిన అవసరం ఉందని చిదంబరం చెప్పారు.
చైనాకు లొంగిపోయిన ప్రధాని మోడీ:
రాహుల్ మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్ట్‌లను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం ట్విటర్ వేదికగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. చైనా దురాక్రమణకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శించారు. మన భూభాగాన్ని చైనాకు ప్రధాని మోదీ అప్పగించారని ఆరోపించారు.