Take a fresh look at your lifestyle.

గోదావరి జిల్లాల్లో కోడి పందాల జోరు

  • బరికి సిద్ధమవుతున్న పందెం రాయుళ్లు
  • కుటీర పరిశ్రమగా పందెం కోళ్ల పెంపకం

కాకినాడ, జనవరి 14 : గోదావరి జిల్లాలో నిర్వహించే కోడి పందేల గురించి ఎంత చెప్పకున్నా తక్కువే. ఇప్పటికే కోనసీమలో సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు, పిండి వంటలు, ఇంటి నిండా బంధువులు…ఒక ఎత్తయితేఒక ఎత్తు అయితే పండుగ సమయంలో గోదావరి జిల్లాల్లో పందాలకూ పెద్దపీట వేస్తారు. పైగా ఈసారి పందెం కోళ్లు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి వొచ్చిందటే చాలు జిల్లాలో కోడిపందేలా జోరు కొనసాగుతుంది. కోర్టులు, ప్రభుత్వం, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా వెనక్కి తగ్గరు. పైగా తమిళనాడు లాంటి ప్రాంతాల్లో కోడి పందేలకు ప్రత్యేక టోర్నమెంట్‌లు ఉంటాయని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఆంక్షలు ఉంటాయంటూ మండిపడుతున్నారు. ఎన్ని హెచ్చరికలు ఉన్నా పందేల విషయంలో వెనుకడుగు వేయరు. ప్రధానంగా ఈసారి వెరైటీ కోళ్లు బరిలో ఉండబోతున్నాయి.

ఓ వైపు తమిళనాడు కోళ్లుమ మరోవైపు పాక్‌ ‌కోళ్లు, ఇంకో వైపు స్థానికంగా పెంచిన కోళ్లు కూడా బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే జిల్లాలో వీటిని దిగుమతి చేసుకున్నారు. న్యాయస్థానాల ఆదేశాలు..పోలీసుల ఆంక్షలు చివరి నిమిషంలో ఆచరణకు నోచుకోక పోవడం పరిపాటిగా మారింది. ఈ పందేల్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పలువురు తరలివస్తుంటారు. ఈ ఏడాది జిల్లాలో పందేలకు తమిళనాడుకు చెందిన కోళ్లు ముందుగానే కాళ్లు దువ్వుతున్నాయి. రాజమండ్రిలో ఈ కోళ్లను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో కోడి ధర రూ.నాలుగు వేల నుంచి రూ.10 వేలకు పైగా పలుకుతుంది. కోరుకొండ, రాజమహేంద్రవరం గ్రాణం, రాజానగరం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కోడి పందేల జోరు కొనసాగుతుండగా, పందెంకోళ్ల పెంపకం ఓ కుటీర పరిశ్రమగా మారింది. ఈ సీజన్‌ ‌వొస్తే కోళ్లలో రకాన్ని ఆధారంగా రూ.వేలల్లో ధర నిర్ణయిస్తున్నారు.  పందేల నిర్వహణకు పది రోజుల ముందే కొనుగోలు చేసి వాటికి మంచి ఆహారం, తర్ఫీదు ఇచ్చి సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా శిక్షకులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. గెలిస్తే కోడిని వండుకుని తినే ఆచారం ఉంది.

సంక్రాంతి వేళ గోదావరి జిల్లాల్లో పందెంకోళ్ల మాంసం తప్ప..బ్రాయిలర్‌, ‌మామూలు కోళ్ల మాంసం కూడా ముట్టుకోరు. పందెంకోడిని బంధుమిత్రులకు వండిపెట్టడం ఓ ప్రత్యేకత. సంక్రాంతి వేళ కోడి పందేలు నిర్వహించేడమే కాదు… ఒక్కో కోడికి రూ. వేల నుంచి లక్షలు ఖర్చు చేసి ఖరీదైన, బలమైన తిండి పెడతారు. వాటికోసం ప్రత్యేక ట్రైనర్లు కూడా ఉంటారు. పందాల్లో పాకిస్తాన్‌ ‌కోళ్లకు మంచి క్రేజ్‌ ఉం‌ది. అందుకే ఈ మధ్య ధైవాన్‌, ‌మలేషియా, ఇండోనేషియా, పాకిస్తాన్‌ ‌లాంటి ప్రాంతాల నుంచి కూడా కోనసీమ పెంపకం దారులు బ్రీడ్‌ ‌తెప్పించి పెంచుతున్నారు. ముఖ్యంగా కత్తులు కట్టకుండా వేసే పందాలకు పాకిస్థాన్‌ ‌బ్రీడ్‌ ‌కోళ్లు బాగా ఉపయోగ పడుతున్నాయని చెబుతున్నారు. ఒకప్పుడు వేల రూపాయల్లో మొదలైన కోడి పందాలు ఇప్పుడు కోట్ల రూపాయల్లో చేతులు మారుతు న్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో గతేడాది వంద కోట్ల రూపాయలకు పైగా చేతులు మారాయ్‌. ‌పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఈలెక్క పెరిగిందే కానీ తగ్గలేదు. ఇక పందెంలో వీర మరణం పొందిన పుంజుల .. మాంసానికి చాలా డిమాండ్‌. ‌వాటిని పెంచడానికి అత్యంత బలమైన ఆహారం పెట్టడంతో ఆ మాంసం రుచి ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే పందెంలో ఓడిన కోడిని దక్కించుకునేందుకు వేలం పాటలు జరుగుతాయి.

Leave a Reply