Take a fresh look at your lifestyle.

‘‘‌చెరగని సంతకం’’!

విప్లవ విజయాన్ని
కలగన్న  కళ్ళు
నిత్య నిర్బంధ రాపిడిలో
నిటారుగా నిలిచిన ఒళ్ళు
అంతిమయాత్రకు సిద్ధమై
పాడె పక్క పై ఒరిగింది
భౌతికంగా మరణం
ఆరునా?విప్లవ కిరణం!!

చలనయుద్దం పై
చెరగని సంతకం
సుదీర్ఘ అజ్ఞాత జీవితం
పీడిత పోరుకు అంకితం
పెనుకష్ట నష్టాల్లో తడపడలే
దమనకాండకు భయపడలే
అగ్నిశిల పై నడిచిండు!!
నిబద్ధత పై గెలిచిండు!!!

(మావోయిస్టు నేత హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే అనారోగ్యంతో మృతి..‘వార్త’ వరంగల్‌ ‌స్టాఫ్‌ ‌రిపోర్టర్‌ ‌గా నల్లమల అడవిలో ఒక రోజంతా ఆయనతో చేసిన ఇంటర్వూ సందర్భం యాది కొచ్చింది.
సోషల్‌ ‌మీడియాలో ‘అంతిమ’పోట్వలు చూసాక…స్పందనకు
అక్షరరూపం)

– కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర

Leave a Reply