విజయవాడ, జనవరి 23 : మార్క్సిస్ట్ విప్లవ శిఖరం చేగువేరా కుమార్తె అలైద గువేరా, ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరాలు సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు ఆర్.అరుణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు, ఆహ్వాన సంఘం కన్వీనర్లు బుడ్డిగ జందార్, సుంకర రాజేందప్రసాద్, తదితరులు కలిసి నేతలకు ఘన స్వాగతం పలికారు. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో నిర్వహించనున్న ’ క్యూబా సంఘీభావ సభ ’ కు అలైద గువేరా, ఎస్తిఫినా గువేరాలు హాజరుకానున్నారు.