కాలం శూలమై..గుండెలపై గుచ్చి
హృదయంలోని పోరలని చీల్చి
ఊపిరినంతటిని బిగపట్టేస్తుంది.
ఒక తుఫాను మాయమవగానే
మరో తుఫాను చుటేస్తుంది.
దశలవారీగా మారి…
బతుకు దిశలను మార్చేస్తుంది.
ఇప్పుడంతా చీకటి జాతరే.
కొన్ని వెలుగు రేఖలు ఆశల్ని బతికిస్తున్నా..
స్వార్ధపు కత్తుల వేటకుఅవి
తెగిపడిపోతున్నాయి.
కొన్ని ప్రేమ పలుకులు వినిపిస్తున్నా…
అవి తెగిపోయిన గొంతులైపోయాయి.
కొన్ని నీటి బిందువులు తడారిపోయిన
పెదవుల్ని ముద్దాడాలని ఉవ్విల్లూరుతున్న
బలమైన గాలి తాకుళ్లకు…
చినుకులన్ని నెలరాలిపోతున్నాయి.
ఇప్పుడంతా మనుషుల అడవి…
కొమ్మలన్నీ విరిగిపోయి
మోడుబారిన వృక్షాల్లా దర్శనమిస్తుంది.
కాసింత నీటి తడి కూడా అందడం లేదు.
ఏమో…ఈ కాలం మళ్ళీ ఎపుడు
చిగురిస్తుందో…?
ఈ చీకటి జాతరలో మళ్ళీ
వెలుగుపూలు ఎప్పుడు పూస్తాయో…?
– అశోక్ గోనె
9441317361