Take a fresh look at your lifestyle.

విత్తన, ఎరువుల దుకాణాలలో తనిఖీలు

ఈరోజు  జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులతో సంయుక్తంగా ఏర్పడి జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఉన్న విత్తన ఎరువుల దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా విత్తన సంచులు పై ఉన్న లేబుల్‌లో ఉన్న వివరాలను క్షుణ్నంగా పరిశీలించారు. గోదాములలో నిల్వ ఉంచిన విత్తన సంచుల, ఎరువుల వివరాలను సేకరించారు.  లైసెన్స్ ‌వివరాలను అలాగే విత్తన సంచులను సరఫరా చేసిన కంపెనీ వివరాలను క్షుణ్నంగా పరిశీలించారు. ప్రతిరోజు ఫర్టిలైజర్‌ ‌షాప్‌లపై తనిఖీలు నిర్వహిస్తామని తెలియజేశారు.ఈ తనిఖీలలో ఎఐలు, అగ్రికల్చర్‌ ఆఫీసర్స్,  ‌సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply