Take a fresh look at your lifestyle.

ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లతో ట్రాఫిక్‌కు చెక్‌

  • ‌హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ‌నిర్మూలనకు చర్యలు
  • బైరామల్‌ ‌గూడ ఫ్లై ఓవర్‌ ‌ప్రారంభంలో మంత్రి కెటిఆర్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 16 : ఫ్లై ఓవర్లు, రహదారుల నిర్మాణంతో నగరంలో ట్రాఫిక్‌ ‌ఫ్రీ జోన్‌ ‌చేయాలన్నదే లక్ష్యమని మంత్రి కెటిఆర్‌ అన్నారు. రద్దీ కూడళ్లలో ఫ్లై ఓవర్ల నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంతగా ఫ్లై ఓవర్ల నిర్మణం జరగలేదన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో స్ట్రాటజిక్‌ ‌రోడ్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌పొగ్రాం(ఎస్‌ఆర్‌డీపీ)లో మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి వొచ్చాయి. ఎల్‌బీనగర్‌ ‌చౌరస్తాలో ఇన్నర్‌ ‌రింగ్‌రోడ్డు మార్గంలో రూ.9.28 కోట్లతో నిర్మించిన అండర్‌పాస్‌, ‌రూ. 28.642 కోట్లతో బైరామల్‌గూడ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ‌ప్రారంభించారు. ఎల్బీనగర్‌ ‌పర్యటనలో భాగంగా నాగోల్‌, ‌బండ్లగూడలో నాలా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. వర్షాలు, వరదల వల్ల ఎల్బీనగర్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. రూ. 2,500 కోట్లతో ఎల్బీనగర్‌ ‌నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.

ఈ క్రమంలో వరద ముంపు నివారణకు రూ. వెయ్యి కోట్లతో నాలాల అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఎల్బీనగర్‌ ‌పరిధిలో మంచి నీటి సమస్యను పరిష్కరించేందుకు 12 రిజర్వాయర్లు నిర్మించామన్నారు. 353 కిలోవి•టర్ల మేర వాటర్‌ ‌పైపులైన్‌లు వేశామన్నారు. ట్రాఫిక్‌ ‌కష్టాలు తీర్చేందుకు ఫ్లై ఓవర్లు, అండర్‌ ‌పాస్‌ల నిర్మాణం చేపట్టినట్లు స్పష్టం చేశారు. గడ్డి అన్నారం మార్కెట్‌ ‌స్థలంలో సూపర్‌ ‌స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు.

Check traffic with flyovers and underpasses

ఎల్బీనగర్‌లో భూ రిజిస్టేష్రన్‌ ‌సమస్య కూడా పరిష్కారిస్తామని హావి• ఇచ్చారు. కొత్త పెన్షన్లు 2 నుంచి 3 నెలల్లో అందజేస్తామని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహముద్‌ అలీతో పాటు ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్‌ శ్రీ‌లత, స్థానిక కార్పొరేటర్లు, తదితరలు పాల్గొన్నారు.

Leave a Reply