Take a fresh look at your lifestyle.

టీకాతోనే కొరోనాకు చెక్‌..‌ప్రతి ఒక్కరూ తీసుకోవాలి

కెసి తండాలో గవర్నర్‌ ‌పర్యటన
తండా వాసులతో కలిసి టీకా రెండో డోసు వేయించుకున్న  తమిళి సై

ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని, కొరోనా నుంచి రక్షణ పొందాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందర రాజన్‌ ‌పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కేసీ తండాలో గవర్నర్‌ ‌సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా కేసీ తండాలో గవర్నర్‌ ‌రెండో డోసు టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు సమావేశంలో గవర్నర్‌ ‌పూర్తిగా తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు.

గవర్నర్‌ ఈ ‌సందర్భంగా మాట్లాడుతూ….‘వి• అందర్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. గిరిజన ప్రజలంటే నాకు చాలా అభిమానం, ప్రేమ’ అని చెప్పారు. గిరిజన గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ ‌తక్కువగా జరుగుతుందని తెలిసిందని, అందుకే వారందరికి ధైర్యం చెప్పేందుకు కేసీ తండాకు తాను వొచ్చానని ఆమె అన్నారు. అందరూ ధైర్యంగా టీకా తీసుకోవాలని, తద్వారా కోవిడ్‌ను జయించొచ్చని, ఇతరులకు కూడా టీకా తీసుకోవాలని చెప్పాలని ఆమె సూచించారు. తాను కేసీ తండాలో టీకా తీసుకొని విన్నపం చేస్తున్నానని, అందరూ టీకా తీసుకోని కోవిడ్‌ ‌నుంచి రక్షణ పొందాలని, అందరూ తప్పకుండా మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలన్నారు. తరుచూ చేతులను శానిటైజర్‌తో శుభ్రంగా కడుక్కోవాలని, జాగ్రత్తలు పాటిస్తూ కోవిడ్‌ ‌నుంచి రక్షణ పొందాలని గవర్నర్‌ ‌తమిళిసై సూచించారు.

Leave a Reply