Take a fresh look at your lifestyle.

‘మేకిన్‌ ఇం‌డియా’ మాటలతో మోసం ..!

  • ఆత్మనిర్భర్‌ ‌భారత్‌, ‌మేకిన్‌ ఇం‌డియా, స్కిల్‌ ఇం‌డియా నినాదాలుగా మిగిలాయి
  • ప్రకటనలతో ప్రజలను మభ్య పెట్టడమేనా
  • విభజన చట్టం మేరకు హామీలను విస్మరించిన కేంద్రం
  • సీఐఐ సదస్సు వేదికగా కేంద్రంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శనాస్త్రాలు

సీఐఐ సదస్సు వేదికగా కేంద్రంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ‌విమర్శనాస్త్రాలు సంధించారు. ఆరున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్టూ ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్‌ ‌ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ‌ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ‌ప్రాజెక్టులపై ఇప్పటి వరకు ఒక్క అడుగూ ముందుకు పడలేదన్నారు. విభజన సందర్భంగా రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హావి•లను అమలు పర్చలేకపోయారన్నారు. పార్లమెంట్‌ ‌సాక్షిగా ఏపీ, తెలంగాణలకు మాటిచ్చారు. ఆత్మనిర్భర్‌ ‌భారత్‌, ‌మేకిన్‌ ఇం‌డియా, స్కిల్‌ ఇం‌డియా గొప్ప నినాదాలని, ప్రధాని .. టీమ్‌ ఇం‌డియా అంటూ గొప్పగా చెబుతుంటారని కానీ ఆచరణలో అవి కనిపించవన్నారు. తామెంతో ఆశించామని, చేయూతగా నిలవలేకపోయిందన్నారు.

దిగుమతి సుంకాలు పెంచి.. మేకిన్‌ ఇం‌డియా అంటే కంపెనీలు వస్తాయా? అని కేటీఆర్‌ ‌కేంద్రాన్ని ప్రశ్నించారు. శుక్రవారం బేగంపేటలో సీఐఐ రాష్ట్ర వార్షిక సమావేశం జరిగింది. కార్యక్రమానికి కేటీఆర్‌తో పాటు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌నినాదం ఇస్తే సరిపోదు.. ఇందుకు తగిన చర్యలు కూడా చేపట్టాలన్నారు. ఇండియా టీకాల రాజధానిగా తెలంగాణ మారిందన్నారు. ఐటీ, లైఫ్‌ ‌సెన్సెస్‌, ‌ఫార్మా, నిర్మాణ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. ఐటీ ఎగుమతులు రూ.1.40లక్షల కోట్లకు చేరాయని, స్టార్టప్‌లతో తెలంగాణ ఇన్నోవేషన్‌ ‌హబ్‌గా మారుతోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ అనేక చర్యలు తీసుకుంటున్నారని, స్పెషల్‌ ‌ఫుడ్‌ ‌ప్రాసెసింగ్‌ ‌జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

డిఫెన్స్, ఏరోస్పేస్‌ ‌రంగానికి హైదరాబాద్‌ ‌నిలయంగా ఉందన్నారు. తెలంగాణకు ఇచ్చిన ఏ హావి•ని కేంద్రం నిలబెట్టుకోలేదని, అలాగే విభజన సమస్యలు పరిష్కరించలేదని కేటీఆర్‌ అన్నారు. గత ఆరేండ్లలో తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదని గుర్తు చేశారు. వరంగల్‌లో రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారని, కోచ్‌ ‌ఫ్యాక్టరీకి 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామన్నారు. ఐటీఐఆర్‌ ‌రద్దు చేసి తెలంగాణకు అన్యాయం చేశారని, తెలంగాణకు ఒక్క ఇండస్టియ్రల్‌ ‌జోన్‌ ఇవ్వలేదని ఆరోపించారు. బయ్యారం ఉక్కు ఊసేలేదన్నారు. కేంద్రం ఇచ్చిన హావి•లు నెరవేర్చకపోతే ఎవరిని అడగాలని ప్రశ్నించారు. కేంద్రం ఎన్నికల కోసం కాకుండా.. ప్రజల కోసం, దేశం కోసం పని చేయాలన్నారు. రాష్ట్రం నుంచే అధిక రెవెన్యూ తీసుకుంటూ అన్యాయం చేస్తున్నారన్నారు.

బుల్లెట్‌ ‌రైలు గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు అర్హత లేదా? అని ప్రశ్నించారు. పారిశ్రామికీకరణ, పారిశ్రామిక రంగంలో తెలంగాణకు జరుగుతోన్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంపై గళమెత్తారు మంత్రి కేటీఆర్‌.. ‌తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగంలో కేంద్రం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోందని ఆరోపించారు. నిజానికి తెలంగాణ ఒక నవజాత శిశువు వంటిది.. నూతన రాష్ట్రం తన కాళ్ల వి•ద తాను నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి అన్ని రకాల సాయం అందించాల్సిన బాధ్యతను కేంద్రం ఆది నుంచి విస్మరించిందన్నారు. అయినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే అభివృద్ధి-సంక్షేమం రెండు ప్రధానమైన అంశాలుగా భావించి సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో ముందుకుపోతున్నామన్న ఆయన.. రాష్ట్రాభివృద్దిలో భాగంగా పారిశ్రామిక రంగానికి అత్యంత అధిక ప్రాధాన్యత ఇచ్చింది.

రాష్ట్రం ఎర్పడిన తొలినాళ్లలో ఉన్న విద్యుత్‌ ‌సంక్షోభం నుంచి పరిశ్రమలకు 24 గంటల పాటు కరెంటు సరఫరా అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకుందన్నారు.. దీంతోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఎస్‌ ఐపాస్‌ ‌వంటి వినూత్నమైన, విప్లవాత్మకమైన పారిశ్రామిక విధానం తీసుకువచ్చి, తెలంగాణను పెట్టుబడుల గమ్యస్ధానంగా మార్చింది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు తెలంగాణ బాట పట్టేలా కార్యాచరణ చేపట్టింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సింగిల్‌ ‌విండో అనుమతుల విధానం తీసుకొచ్చి, దాదాపు 15 వేల కంపెనీలు, రెండు లక్షల 12 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించింది. తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాల కల్పన ఇప్పటిదాకా జరిగిందని తెలిపారు.

ఇక, తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్రాన్ని సంప్రదిస్తూనే ఉన్నాం… విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం… అయితే సమయం, సంవత్సరాలు గడుస్తున్నవే కానీ… కేంద్రం నుంచి సానుకూల స్పందన మాత్రం రావడం లేదని కేటీఆర్‌ ‌విమర్శించారు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం మా గొంతును గట్టిగా విప్పాల్సిన అవసరం, సమయం వచ్చిందన్నారు.

Leave a Reply