Take a fresh look at your lifestyle.

చార్‌ ‌ధామ్‌ ఆలయాలు.. జాతీయ రహదారితో అనుసంధానం

  • కేదార్‌నాథ్‌ను సందర్శించిన ప్రధాని మోడీ
  • కేదారనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకం
  • శంకరాచార్య విగ్రహ ఆవిష్కరణ
  • 130 కోట్లతో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన

చార్‌ ‌ధామ్‌ ఆలయాలన్నీ జాతీయ రహదారితో అనుసంధానం కాబోతున్నాయని, దీంతో ఈ ప్రాంతానికి భక్తులు మరింత సులభంగా చేరుకునే అవకాశం ఉందని ప్రధాని మోడీ అన్నారు. కేదార్‌నాథ్‌ ‌పర్యటన పదాలకు అందని అద్భుత అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుందని, సామాన్య మానవుడి సంక్షేమం కోసం ఆదిశంకరాచార్య జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని అన్నారు.శుక్రవారం జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్‌నాథ్‌లో ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడ ఆయన కేదారీశ్వరుడికి పూజలు చేశారు. ఆ తర్వాత ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో కార్తీక మాసం తొలిరోజు శుక్రవారం నాడు ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ..ఆదిశంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అందరూ తిలకించారన్నారు. శంకరాచార్య భక్తులు ఈ పుణ్య స్థలంలో ఆత్మ స్వరూపంలో హాజరైయ్యారన్నారు. దేశంలో ఉన్న అన్ని మఠాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు..కేదార్‌నాథ్‌లో జరుగుతున్న శంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నట్లు మోదీ తెలిపారు. 2013లో వొచ్చిన ఉప్పెనలో 8వ శతాబ్దానికి చెందిన మతగురువు శంకరాచార్య సమాధి ధ్వంసమైన విషయం తెలిసిందే. అయితే కేదార్‌నాథ్‌ను మళ్లీ పునర్‌ ‌నిర్మాణం చేపడుతారా అన్న సందేహాలు ప్రజల్లో ఉండేవని, కానీ తన మనసులో ఒక స్వరం ఎప్పుడూ కేదార్‌ను అభివృద్ధి చేయవచ్చని వినిపించేదని మోదీ అన్నారు.

Char Dham Temples Connected with the National Highway

గడిచిన వందేళ్లలో వొచ్చిన భక్తుల సంఖ్య కన్నా..రాబోయే పదేళ్లలో ఇక్కడకు వొచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని మోదీ అన్నారు. 2013లో వరదల్లో దెబ్బతిన్న శంకరాచార్య సమాధిని పునరుద్ధరిస్తున్న విషయం తెలిసిందే. కొత్తగా డిజైన్‌ ‌చేసిన ఆది గురువు శంకరాచార్య విగ్రహం 12 అడుగులు ఉన్నది. బాబా కేదార్‌ ఆలయం వెనుక భాగంలో శంకరాచార్య సమాధి ఉన్న విషయం తెలిసిందే. ఆ సమాధి పునరుద్ధరణ పనులను స్వయంగా మోదీ సవి•క్షిస్తున్నారు. 2019 నుంచి శంకరాచార్య విగ్రహ పునర్‌ ‌నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆదిశంకరాచార్య విగ్రహం సుమారు 35 టన్నుల బరువుతో నిర్మించారు. పర్యటనలలో భాగంగా ఉదయం 8.30 నిమిషాలకు కేదార్‌నాథ్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. కేదారీశ్వరుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. హారతి ఇచ్చారు. ఆ తర్వాత ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేశారు. కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రధాని మోదీ శివుడికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆదిశంకరాచార్య విగ్రహం, సమాధిని ప్రారంభించారు. కేదార్‌నాథ్‌లో రూ. 400 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప నలు చేశారు.

పూజారుల నివాస గృహాలు, వంతెనలు, రిటైనింగ్‌ ‌వాల్‌ ‌భక్తుల వసతి సదుపాయాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానిమోదీ మాట్లాడుతూ..‘మన దేశ సాంస్కృతిక చిహ్నాలకు పునర్‌వైభవం రావాల్సిన అవసరం ఉంది. కఠినమైన లక్ష్యాలను సైతం డెడ్‌ ‌లైన్ల లోపలే పూర్తి చేస్తున్నాం. అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతుంది, దాని కీర్తిప్రతిష్టలు మరింత ఉన్నతంగా కాబోతున్నాయి’ అని ప్రధాని మోదీ అన్నారు. ఇక ఆదిగురు శంకరాచార్య విగ్రహం 12 ఫీట్ల పొడవు, బరువు 35,000 కిలోలు. దీనిని మైసూర్‌కు చెందిన శిల్పులు క్లోరైట్‌ ‌స్కిస్ట్‌తో తయారు చేశారు. భీకర వర్షాలు, ఎండలతో పాటు ఎలాంటి ప్రకృతి వైపరిత్యం తలెత్తినా తట్టుకునేలా దీనిని నిర్మించారు. మైసూర్‌కు చెందిన ప్రముఖ శిల్పి యోగిరాజ్‌ ఈ ‌విగ్రహాన్ని తయారుచేశారు.

ఆదిశంకరాచార్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం 130 కోట్లతో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. కేథార్‌నాథ్‌ ‌టెంపుల్‌ ‌దగ్గర సరస్వతి రిటనింగ్‌ ‌వాల్‌, ‌ఘాట్స్, ‌మందాకిని రిటనింగ్‌ ‌వాల్‌, ‌తీర్థ్ ‌పురోహిత్‌ల గృహ నిర్మాణాలు, గురుధ్‌ ‌చట్టి బ్రిడ్జ్ ‌నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఆది శంకరాచార్య భక్తులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారన్నారు. దేశంలోని అన్ని జ్యోతిర్లింగాలు మనతో అనుసంధానించబడి ఉన్నాయని మోదీ పేర్కొన్నారు.

Leave a Reply