Take a fresh look at your lifestyle.

రాజస్థాన్‌ అసెంబ్లీలో గందరగోళం

  • సిఎం గెహ్లాట్‌ ‌బడ్జెట్‌ ‌ప్రసంగంపై బిజెపి విమర్శలు
  • పాత బడ్జెట్‌ ‌కాపీని చదువుతున్నారని ఎద్దేవా

జయపుర, ఫిబ్రవరి 10 : రాజస్తాన్‌ అసెంబ్లీ శుక్రవారం రసాభాసగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ ‌ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష బిజెపి నిరసనలు వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి గెహ్లాట్‌ ‌బడ్జెట్‌ను చదువుతుండగా.. అది పాత బడ్జెట్‌ అం‌టూ బిజెపి ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి తప్ప మరెవరూ బడ్జెట్‌ ‌కాపీని పొందకూడదని, అయితే బడ్జెట్‌ ‌కాపీని కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హడావిడీ చేయడంతో నలుగురైదుగురు చేతుల్లోకి మారిందని బిజెపి ఛబ్రా ఎమ్మెల్యే గులాబ్‌ ‌చంద్‌ ‌కటారియా, బిజెపి నేత ప్రతాప్‌ ‌సింగ్‌ ‌సంఘ్వీలు ఆరోపించారు. బడ్జెట్‌ ‌లీకైందని, ముఖ్యమంత్రి కొత్త బడ్జెట్‌ను తీసుకురావాలని డిమాడ్‌ ‌చేశారు. సభ తిరిగి ప్రారంభం కాగానే..

ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి గెహ్లాట్‌ ‌తోసిపుచ్చారు. బడ్జెట్‌ ‌లీక్‌ ‌కాలేదని, గతేడాది బడ్జెట్‌కు చెందిన అదనపు పేజీ సూచనల కోసం తాజా బడ్జెట్‌ ‌పత్రాలలో చేర్చారని అన్నారు. బిజెపి ఆరోపణలపై గెహ్లాట్‌ ‌విరుచుకుపడ్డారు. రాజస్తాన్‌ అభివృద్ధికి, ప్రగతికి వ్యతిరేకమని చూపించాలనుకుంటుందని అన్నారు. చిల్లర రాజకీయాల కోసం బిజెపి బ్జడెట్‌ను కూడా విడిచిపెట్టడం లేదని మండిపడ్డారు. పొదుపు, ఉపశమనం, పురోగతి ఈ ఏడాది రాష్ట్ర బ్జడెట్‌ ‌థీమ్‌ అని, అది బిజెపికి అడ్డంకిగా మారిందని అన్నారు. అయితే మొదట అశోక్‌ ‌గెహ్లాట్‌ 2023-24 ‌బడ్జెట్‌కు బదులుగా పట్టణ ఉపాధి మరియు కృషి బడ్జెట్‌పై మునుపటి బ్జడెట్‌ను చదివారు. గతేడాది బడ్జెట్‌లో రెండు ప్రకటనలు చేసిన వెంటనే .. బిజెపి సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు.

Leave a Reply