Take a fresh look at your lifestyle.

కొత్త వేరియంట్లకు తగ్గట్లుగా టీకాలలో మార్పులు

  • తయారీ సంస్థలకు ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌సూచ
  • నఅప్పుడే అవి ప్రభావవంతంగా పనిచేస్తాయని వెల్లడి

కొరోనా కొత్త రూపం ఒమిక్రాన్‌ ‌ప్రపంచమంతా వ్యాపిస్తుంది. పూర్తిగా వ్యాక్సినేషన్‌ ‌రెండు డోసులు చేయించుకున్నవారికి కూడా ఒమిక్రాన్‌ ఇన్‌ఫెక్షన్‌ ‌సోకుతుంది. దీంతో అసలు టీకాలు పనిచేస్తున్నాయా అనే సందేహాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ ‌ప్రధాన వైద్యుడు డాక్టర్‌ ‌సందీప్‌ ‌గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్య నిపుణుల సభలో ఆయన మాట్లాడుతూ..కొరోనా వైరస్‌ ‌కొత్త వేరియంట్లపై టీకాలు ప్రభావం చూపకపోవడానికి గల కారణం వైరస్‌లో కొత్త మ్యూటేషన్లు జరగడమేనని అన్నారు. ఇలాంటి సమస్యను అధిగమించడానికి ప్రస్తుత టీకాలలో కొత్త వేరియంట్లకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చన్నారు.

అలా చేసుకుంటే వైరస్‌పై టీకాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని అన్నారు. టీకాలు ఒకేసారి భారీ మొత్తంలో తయారు చేయడంకన్నా ఏడాదికోసారి మార్పులు చేసి సరిపడ మొత్తంలో తయారు చేసుకుంటే మంచిదని, ధనిక దేశాలు ఇప్పటికే భారీ మొత్తంలో టీకాలు తయారు చేసి ఉంటే వాటిని పేద, మధ్య తరగతి దేశాలకు పంపిణీ చేస్తే అవి వృథా కాకుండా చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply