Take a fresh look at your lifestyle.

వ్యవసాయ రంగంలో మార్పు తక్షణ అవసరం

  • రైతుల ఆర్థికస్థితిగతులను మార్చనున్న బిల్లులు
  • తమ ఉత్పత్తులను ఎక్కడైనా..ఏ ధరకైనా అమ్ముకోవచ్చు
  • ప్రధాని మోడీ స్పష్టీకరణ
 ‌కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశ అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లులు చారిత్రాత్మకమని… రైతుల ఆర్థిక స్థితి గతులను మార్చివేస్తాయని చెప్పారు. తాజా బిల్లులతో రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా… ఏ ధరకైనా అమ్ముకునే వెసులుబాటు కలిగిందన్నారు. ఉభయసభల్లో వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆన్‌లైన్‌ ‌ద్వారా వీటిపై మాట్లాడారు. పార్లమెంటులో  రెండు వ్యవసాయ బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా రైతులకు అభినందనలు తెలియజేస్తున్నాను.
వ్యవసాయరంగంలో ఈ మార్పు ఇప్పటి తక్షణ అవసరం… అందుకే తమ ప్రభుత్వం కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. ఇప్పుడు రైతులు తమ ఉత్పత్తులను తమకు నచ్చిన ధరకు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. రైతుల ఆర్థిక స్థితి గతులను మార్చేందుకు ఈ బిల్లులు ఉపయోగపడుతాయని మోదీ పేర్కొన్నారు.కొత్త బిల్లులు చట్టాలుగా అమలులోకి వస్తే ఇప్పుడున్న మండీలు లేదా వ్యవసాయ మార్కెట్లు లేకుండా పోతాయని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మోదీ అన్నారు. ఆ మండీలు అలాగే కొనసాగుతాయని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులతో విపక్షాల రైతుల ఓటుబ్యాంకు చేజారిపోయే ప్రమాదముందని, అందుకే ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని ఘాటుగా విమర్శించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply