Take a fresh look at your lifestyle.

సదాలోచనతోనే సమాజంలో మార్పు: మంత్రి హరీష్‌రావు

Change in society with thought Minister Harishraoప్రతి ఒక్కరూ మంచి ఆలోచనతో ముందుకు సాగినప్పుడే సమాజంలో గొప్ప మార్పు వస్తుందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో కిద్మత్‌ ‌కోఆపరేటివ్‌ ‌సొసైటీ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…ముస్లిం మైనార్టీల సంక్షేమానికి సిఎం కేసీఆర్‌ ‌పెద్దపీట వేస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీలు ఎస్సీ ఎస్టీల కంటే నిరుపేదలు చాలామంది ఉన్నారని గుర్తించిన సిఎం కేసీఆర్‌ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే పథకాలు తరహాలోనే ముస్లింలకు అందించడానికి ఎంతో కృషి చేశారు. ముస్లింల పిల్లలకు మెరుగైన విద్యాబోధన నుంచి ఉన్నత స్థాయిలో ఉండేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. 80 శాతం సబ్సిడీపై రుణాలను అందిస్తున్నామన్నారు. నిరుపేదలకు సేవలు చేస్తే ఎంతో తృప్తి కలుగుతుందన్నారు. కిద్మత్‌ ‌సొసైటీ బ్యాంక్‌ ‌సామాన్యుల బ్యాంకు అని, మిత్తి లేకుండా పేద వారికి రుణాలు అందిస్తూ సహాయపడుతున్నారు. బ్యాంకు ఇచ్చే రుణాలతో పేద వారు, చిరు వ్యాపారం చేసుకుంటూ లబ్ధి పొందవచ్చని, ఒక్కరోజు ఆనందం కోసం పార్టీలలో డబ్బు వృధా చేయకుండా పేద వారికి ఉపయోగపడే బ్యాంకులో డిపాజిట్‌ ‌చేస్తే బాగుంటుందన్నారు. పేదవారికి సేవ కోసం పాటుపడాలని, బ్యాంక్‌ ‌పేదలకు సేవలందిస్తోందన్నారు.

కిద్మత్‌ ‌బ్యాంక్‌ ‌సేవలు రోజురోజుకూ విస్తరిస్తున్నాయన్నారు. ఈ సొసైటీకి ప్రభుత్వపరంగా నిధులు వచ్చే విధంగా సిఎం కేసీఆర్‌తో మాట్లాడుతానన్నారు. డబ్బులను వృధా ఖర్చు చేయకుండా సేవ కార్యక్రమాలకు పెట్టాలన్నారు. గతంలో మైక్రో బ్యాంకులు నిరుపేదలకు అప్పుగా డబ్బులను ఇచ్చి వారి రక్తాన్ని తాగారన్నారు. అదే కిద్మత్‌ ‌బ్యాంక్‌ ‌మిత్తి లేకుండా రుణాలు ఇస్తుందనీ మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, ‌మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, కిద్మత్‌ ‌సొసైటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply