Take a fresh look at your lifestyle.

అమరావతి భూములు అమ్ముకునే హక్కు ఎక్కడిది

  • రాజధాని కట్టకుండా భవనాలు లీజుకెలా ఇస్తారు
  • శ్మశానం అనిచెప్పిన భూములను ఎలా అమ్ముతారు
  • ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డ చంద్రబాబు

అమరావతి, జూన్‌ 27 : అమరావతి భూములు,భవనాలు అమ్మె హక్కు ప్రభుత్వానికి లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతి ఓ శ్మశానం అన్న వ్యక్తికి అమ్ముకునే హక్కుఎక్క డిదన్నారు. పార్టీ ముఖ్యనేతలతో వీడియోకాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజధాని కట్టని వారికి భూములు అమ్మే హక్కు, ఉద్యోగులకు కట్టిన ఇళ్లను ప్రైవేట్‌ ‌సంస్థలకు అద్దెకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అమరావతిని శ్మశానం అని చెప్పిన ప్రభుత్వం ఈ భూములను ఎకరాకు రూ. 10 కోట్లు ఎలా అమ్ముతుందని నిలదీశారు. అధికార వైసీపీ పాలనలో ప్రజలకు పన్నుల వాతలు, పథకాలకు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. ఒంటరి మహిళల పింఛనులో ఆంక్షలు విధించడం అమానవీయమని అన్నారు. అమ్మ ఒడిలో 52 వేల మంది లబ్దిదారులు తగ్గారని అన్నారు. ఆత్మకూరులో డబ్బు పంచినా వైసీపీకి ఓటు శాతం పెరగలేదని తెలిపారు. దుకాణాల్లో విక్రయించే మద్యం నాణ్యతపై ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. నిధుల్లేక దుల్హన్‌ ‌పథకం నిలిపివేశామని కోర్టుకు చెప్పడం దారుణమని చంద్రబాబు అన్నారు. పంట నష్టపోయిన రైతులకు మొండి చేయి చూపించారని ఆరోపించారు. ఇదిలావుంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు.

సంక్షేమ పథకాల వర్తింపులో రకరకాల నిబంధనలతో కోతులు పెడుతూ.. ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి పథకంలో 52 వేలమంది లబ్దిదారులు తగ్గారు. ఒంటరి మహిళకు ఇచ్చే పింఛన్లో నిబంధనలు మార్చారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్‌కు రాజధాని భూమలు అమ్మే హక్కు ఎక్కడిది? అమరావతిని శ్మశానంతో పోల్చిన ఈ ప్రభుత్వం… ఇప్పుడు ఎకరా రూ. 10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుంది? ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చెయ్యకుండా…ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు ఇవ్వజూపడం అన్యాయం అన్నారు. డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోటీలో లేకున్నా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీకి ఓట్లు పెరగలేదు. ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆత్మకూరు ఉపపోరు ఫలితాల్లో కనిపించింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే మద్యం నాణ్యతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిధుల్లేక దుల్హన్‌ ‌పథకాన్ని నిలిపివేశామని హైకోర్టుకు చెప్పడం జగన్‌ ‌రెడ్డి మోసానికి నిదర్శనం అన్నారు. ఈ-క్రాప్‌ ‌నమోదులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తల పేర్లు నమోదు చేసి.. పంట నష్టపోయిన రైతులకు మొండిచేయి చూపారని చంద్రబాబు పేర్కొన్నారు.

Leave a Reply