Take a fresh look at your lifestyle.

చాణక్య చంద్రశేఖరా..

  • మనసా చింతితం కార్యం వచసాన ప్రకాశయేత్‌
  • ‌మంత్రేణ రక్షయేత్‌ ‌గూడమ్‌ ‌కార్యేచపీ నియోజయేత్‌

‌మనసులో ఆలోచించిన దాన్ని మాటల్లో ప్రకటించకూడదు. రహస్యంగా వేసిన పథకాన్ని ఆచరణ ద్వారానే చూపాలి. ఎప్పుడో రెండు వేల పైచిలుకు ఏళ్ళ కిందట అర్థశాస్త్రంలో కౌటిల్యుడు చెప్పిన నీతి ఇది. పాశ్చాత్యుల దగ్గరి నుంచి అలెగ్జాండర్‌ ‌దండయాత్రల ఫలితంగా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన రాజ్యాన్ని ఐక్యం చేసి ఆధునిక భారతాన్ని నిర్మిద్దామని కలలుగన్న చాణక్యుడు అధికారంలోకి రావడానికి రాజు అవలంబిచాల్సిన పద్ధతుల్ని, అధికారంలోకి వచ్చాక అనుసరించాల్సిన అంశాలని వందలకొద్దీ శ్లోకాల్లో విడమర్చి, విశదీకరించి తన అర్థశాస్త్ర గ్రంథంలో పేర్కొన్నాడు. అర్థ శాస్త్ర గ్రంథం కేవలం ఆర్థిక శాస్త్రం కాదని, అది రాజనీతి శాస్త్రానికి మూలగ్రంథంగా రాజనీతి పండితుల ప్రశంసలు నేటికీ పొందుతోంది.

ప్రభుత్వ రూపం ఏదైనా, రాజ్య స్వరూపం ఏదైనా కౌటిల్యుని అర్థశాస్త్రం ఇప్పటి పాలకులు అధ్యయనం చేసి ఆచరించినట్లయితే పది కాలాల పాటు ప్రశంసలు పొందగలుగుతారు. రాజ్యాన్ని ఎలా నడపాలనుకునేవారు, ప్రభుత్వం నడిపించాలని అనుకునేవారు తమ లోపాలను దాచి శత్రువుల బలహీనతలను వెతకాలని, కాలం కలిసి వచ్చినప్పుడు నాయకుడు నిర్బంధంగా, నిక్కచ్చిగా, నియంతగా వ్యవహరించాలని, కాలం కలిసి రానప్పుడు ముక్కుసూటిగా పోకూడదని, మౌనంగా ఉంటూ సందర్భం వచ్చినప్పుడే కుండను పగలగొట్టి ముక్కలు చేసినట్లు చేయాలని చెబుతాడు చాణక్యుడు. చాణక్యుడి ఆత్మను వెతికి పట్టుకొని..ఈ భూమండలంలో నువ్వు చెప్పింది తూచా తప్పక ఆచరిస్తూ ఉన్నది ఎవరు అని అడిగితే ఇప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని మాత్రం ముందుగా ఎంపిక చేస్తాడు. ఆయన పేరు… కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

అనుకూల పరిస్థితుల గురించి మీనమేషాలు లెక్క పెట్టకుండా స్థితిని అంచనా వేసి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుని లక్ష్యం చేరుకునే వాడే అంతిమంగా విజయం సాధిస్తాడు. కెసిఆర్‌ ‌సాధించింది, సాధిస్తున్నది అది. తెలంగాణ ఉద్యమం గత ఐదారు దశాబ్దాల కాలం నుండి అనేక రూపాలలో కొనసాగుతున్నా..తెలంగాణ రాష్ట్ర సాధన కెసిఆర్‌ ఆధ్వర్యంలో ఏర్పడ్డ టిఆర్‌ఎస్‌కు ముందు ఒక రకంగా ఉంటే, ప్రజాస్వామిక వ్యవస్థలు రాజకీయ పక్రియకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి తెరాస అనుసరించిన పద్ధతులు, వేసిన ఎత్తుగడలతో పరిస్థితులను ప్రభావితం చేసిన తీరు, కెసిఆర్‌ ‌చేపట్టిన కార్యక్రమాలు, నడిపించిన ఉద్యమాలు, పాల్గొన్న రాజకీయ పక్రియ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని స్థిరపరచి, విస్తృత పరచి, వ్యవస్థీకృతం చేసి గమ్యాన్ని ముద్దాడిన తీరు చాణక్యుని యుద్ధనీతిని మరిపింప చేస్తుంది.

1999 ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు, తెలంగాణలో అధికార టిడిపి ఎదుర్కొన్న పరిస్థితులు, 2000 ఆగస్టు 11న లేక్‌ ‌వ్యూ అతిథి గ ృహంలో 41 మంది తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ సంతకాలు చేసి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు శ్రీమతి సోనియాగాంధీకి సమర్పించడం, ఆమె క్షుణ్ణంగా విషయం తెలుసుకొని సానుకూలంగా స్పందించడం జరిగింది. అంతకుముందు 1998లో కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఉత్తరాంచల్‌, ‌ఝార్ఖండ్‌, ‌చత్తీస్‌ ‌ఘడ్‌ ఏర్పాటు చేయడం..1998 పార్లమెంట్‌ ఎన్నికల ముందు బిజెపి కాకినాడ సమావేశంలో  ‘‘ఒక ఓటు- రెండు రాష్ట్రాల’’ నినాదంతో తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం.. ఏ రోజుకైనా జాతీయ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, ‌భారతీయ జనతా పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు ముందుకు వస్తాయని నాటి  పరిస్థితులన్నింటిని  2000 సంవత్సరంలోనే అంచనా వేసి దూరద ృష్టితో సందర్భం వచ్చినప్పుడు పార్టీని ప్రకటించి, జెండాను పాతి ఎజెండా ప్రకటించిన చంద్రశేఖర రావు నాటి నుంచి నేటి వరకు ప్రతి సందర్భంలోనూ చాణక్య నీతిని ప్రదర్శిస్తున్నారు. 2000 ఏప్రిల్‌ 27 ‌నుండి నేటి వరకు ఉద్యమకారునిగా, పార్టీ నేతగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయనను నిశితంగా పరిశీలిస్తే చాణక్యుడు చెప్పిన నీతి బోధపడుతుంది.

ఇద్దరు పార్లమెంటు సభ్యులతో తెలంగాణ వచ్చిందా… సోనియమ్మ ఇచ్చింది. ఇందులో కెసిఆర్‌ ‌గొప్పతనం ఏముంది? అని చెప్పుకునే కాంగ్రెస్‌ ‌నాయకులు కెసిఆర్‌ను ఇంకా పూర్తిగా అధ్యయనం చేయలేదు అనిపిస్తుంది. వర్తమానంలో ఉన్న నాయకులతో పోల్చినప్పుడు కెసిఆర్‌ ‌ది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. తెలంగాణ సమస్యలు సాధకబాధకాలతో ముడిపడిన అంశాలన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేసి విమర్శనాత్మకంగా విశ్లేషించ గలిగిన, వివరించగలిన, ఏ అంశంపైనైనా సరే అలవోకగా, అనర్గళంగా అబ్బురపరిచే రీతిలో ప్రసంగించి ప్రశంసలు పొందగలిగే అసమాన ప్రతిభా శీలి కెసిఆర్‌. ‌చాణక్యుడు చెప్పిన రాజనీతి అదే. గతం పునాదులపై నిలబడి భవిష్యత్తును అంచనావేసి వర్తమాన పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకున్న వాడే నాయకుడవుతాడు..పది కాలాల పాటు నిలబడతాడు.

ఉద్యమ సమయంలో తెలంగాణలో నెలకొన్న వాస్తవాలను ఒకవైపు పాలకవర్గాల దృష్టికి తీసుకురావడంలో, మరోవైపు జనసామాన్యాన్ని ఆలోచింప చేయడంలో, వారిని ఉద్యమానికి సమాయత్తం చేయడంలో విజయం సాధించడం మామూలు విషయం కాదు. సమకాలీన రాజకీయ సంస్కృతిలో నిలదొక్కుకోవాలంటే ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అదే కెసిఆర్‌ అనుసరించారు..అవలంబించారు. అందుకే వరుస విజయాలు సాధిస్తున్నారు. మంచి ముఖ్యమంత్రిగా అశేష జనవాహిని మదిలో నిలిచి పోతున్నారు.
‘‘తెలంగాణ కోసం కొట్లాడిన, మాట్లాడిన ఎంతో మంది నాయకులను చూశాను..కలిసి పనిచేశాను. కానీ మీతో మాట్లాడిన తర్వాత, మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని నమ్మకం విశ్వాసం నాలో కలుగుతున్నది.’’ ఇది కేసీఆర్‌తో జయశంకర్‌ ‌సార్‌ 2000 ‌సంవత్సరంలోనే అన్న మాటలు.

నిజమే కావచ్చు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్‌. ‌మరి ఎందుకు తెలంగాణ ప్రజలు ఇంతగా కేసీఆర్‌ను విశ్వసిస్తున్నారు. ఎప్పుడైనా కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలు ఆలోచించారా? ఆలోచించరు. కెసిఆర్‌ ‌వ్యవహారశైలిని పోటాపోటీగా విమర్శించడం తప్ప వారికి ఇంకా ఏమీ తెలియదు. ఉద్యమ సమయం నుండి మొదలుకుని నిన్న మొన్న జరిగిన జిహెచ్‌ఎమ్‌సి ఫలితాల వరకు ఇక కేసీఆర్‌ ‌పని అయిపోయింది..పరిస్థితి చల్లబడింది అని విమర్శకులు భావించిన ప్రతీ•సారి రెట్టించిన ఉత్సాహంతో ఉరకలెత్తించడం ఆయనకే చెల్లుతుంది. ఇంకో పదేండ్ల వరకు నేనే సీఎం అని ప్రకటించడంలో మర్మమేమిటన్నది రానున్న రోజుల్లో అర్థం కావచ్చు.
ఆయన మాటల వెనక, మౌనం వెనుక ఏదో పరమార్థం దాగి ఉంటుంది. ఫామ్‌ ‌హౌస్‌లో పడుకుంటారని విమర్శించే ప్రతిపక్షాలు ఆయన వేసే పాచికల ముందు పరేషాన్‌ అవుతున్నాయి.

కెసిఆర్‌ ‌చాణక్యుడి రాజనీతిని ఔపోసన పట్టి ఉంటారు. ఎవరు ఎన్ని నకరాలు పోయినా సమయం వచ్చే వరకు ఓపిక పట్టి మళ్లీ లేవకుండా గిరవాటు వేయడంలో ఆయన అనుసరించిన పద్ధతుల్ని ప్రత్యర్థులు అధ్యయనం చేయాల్సిందే. చివరాఖరికి చెప్పేది ఏమిటంటే రాష్ట్రంలో విపక్షాలు, కెసిఆర్‌ ‌విమర్శకులు, ప్రత్యర్థులు చాణక్యుడిని చదవకున్నా పర్వాలేదు.. చంద్రశేఖర రావును చదివితే చాలు. ఎందుకంటే చాణక్యుడు బ్రతికి ఉంటే చంద్రశేఖర రావు గారి దగ్గర చాలా నేర్చుకునేవాడు.

suresh kaleru
సురేష్‌ ‌కాలేరు –
రాష్ట్రసహాద్యక్షులు
తెలంగాణా ఉద్యోగుల సంఘం
9866174474

Leave a Reply