Take a fresh look at your lifestyle.

సవాళ్లకు తలొగ్గితే .. అభివృద్ధి సాధించలేం

pm modi speech im loksabha

  • కాంగ్రెస్‌ ‌పాలన ఉంటే 370 ఆర్టికల్‌, ‌ట్రిపుల్‌ ‌తలాక్‌, అయోధ్య సమస్యలు పరిష్కారమయ్యేవి కావు
  • లోక్‌సభలో  ప్రధానమంత్రి నరేంద్రమోడీ

సవాళ్లకు తలొగ్గకుండా ముందుకెళ్తేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నొచుకొని ఎన్నో సమస్యలను తాము పరిష్కరించామని, గత ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తే చారిత్రక మార్పులు చేసేవాళ్లం కాదని ప్రధాని పేర్కొన్నారు. సవాళ్లపై వెనుకడుగు వేస్తే ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగా ఉండిపోతామనీ.. సవాళ్లు, సమస్యలను ఎదుర్కొనే సత్తా తమలో ఉందని ప్రధాని పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ గురువారం లోక్‌సభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం నవీన భారత నిర్మాణాన్ని ఆవిష్కరించిందంటూ కొనియాడారు. లోకసభ వేదికగా కాంగ్రెస్‌ ‌పార్టీపైనా, ఆ పార్టీ నేతృత్వంలో కొనసాగిన గత ప్రభుత్వాల పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు, చ•తురోక్తులతో ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్‌ ‌మాదిరిగా ఆలోచించి ఉంటే దేశంలో ఇప్పటికీ అనేక సమస్యలు అపరిష్క•తంగా ఉండిపోయే వంటూ దుయ్యబట్టారు. ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌పేరుతో ముస్లిం మహిళలను భయపెట్టారనీ… కాంగ్రెస్‌ ‌బాటలో వెళ్తే ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌సమస్య ఇప్పటికీ అలాగే ఉండేదని ప్రధాని పేర్కొన్నారు. లా ఆలోచిస్తే రామ మందిర వివాదం ఇప్పటికీ కొనసాగేది. జమ్మూ కశ్మీర్‌ ‌ప్రజల కష్టాలు కూడా అలాగే ఉండేవి. కర్తాపూర్‌ ‌సాహెబ్‌ ‌కారిడార్‌ ‌వాస్తవ రూపంలోకి వచ్చేది కాదు. ప్రభుత్వమే కాదు.. పాలనలోనూ ప్రజలు మార్పు కోరుకున్నారు. 70 ఏళ్ల పాటు 370 ఆర్టికల్‌ అలాగే కొనసాగింది. ప్రపంచం భారత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నందున… తదనుగుణంగా పనిచేయాల్సి ఉందన్నారు. అందుకోసం తాము అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు విజన్‌ను, డైరెక్షన్‌ను ఇచ్చిందన్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం మా కార్యాచరణ పట్ల ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. అతి తక్కువ సమయంలో ప్రభుత్వం ఇన్ని అద్భుతాలు ఎలా చేస్తుందని ప్రతిపక్షాలు ఆశ్చర్యపోతున్నాయన్నారు.

ప్రజలు ప్రభుత్వాన్ని మార్చడమే కాదు, ఆ ప్రభుత్వంతో ముందకు వెళ్లేందుకు సిద్దమయ్యారన్నారు. గత 70 ఏళ్ల పాలన తరహాలోనే ప్రభుత్వం నడిస్తే.. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 ‌రద్దు అయి ఉండేది కాదన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం నిజం అయ్యేది కాదని ప్రధాని తెలిపారు. రాజకీయ స్థిరత్వం కోసం ఈశాన్యా రాష్టాల్రు ఎన్నో దశాబ్దాలు వేచి చూశాయన్నారు. కానీ మేం ఈశాన్య రాష్టాల్రను తాము ఢిల్లీకి చేరువ చేశామన్నారు. బోడోలు ఆయుధాలను విడిచిపెట్టినట్లు ప్రధాని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న కనీస మద్దతు ధర సమస్యను పరిష్కరించామన్నారు. కొన్ని రాష్టాల్రు పీఎం కిసాన్‌ ‌స్కీమ్‌ను అమలు చేయడం లేదని, రైతుల విషయంలో రాజకీయాలు చేయవద్దు అని అన్నారు. ప్రధాని ప్రసంగిస్తుండగా కాంగ్రెస్‌ ఎం‌పీలు మహాత్మా గాంధీ అమర్‌ ‌రహే అంటూ నినాదాలు చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఇటీవల బీజేపీ ఎంపీ హెగ్డే .. గాంధీజీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ ఎం‌పీ అధిర్‌ ‌రంజన్‌ ‌సభలో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ కు ట్రైలరే కావచ్చు, కానీ మాకు మాత్రం ఆయనే జీవితం అన్నారు. ఆరునెలల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే ప్రధాని మోదీని యువత కర్రలతో బాదుతారని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ చేసిన వ్యాఖలపై ప్రధాని మోదీ ప్పందిస్తూ గత పాలకుల బాటలోనే పయనిస్తే ఆర్టికల్‌ 370 ‌రద్దయ్యేది కాదని, ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌సమస్య పరిష్కారమయ్యేది కాదని విపక్షాలకు మోదీ చురకలు వేసారు.

పౌరసత్వంతో ఎవరికీ నష్టం లేదు
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరపట్టిక వల్ల ఏ మతస్తులకూ ఎటువంటి నష్టం ఉండదని ప్రధాని మోదీ అన్నారు. మైనార్టీల పేరుతో కాంగ్రెస్‌ ‌రాజకీయం చేస్తున్నదని, సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ‌విపక్షాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని, వాళ్లకు ముస్లింలు కేవలం ముస్లింలే అని, కానీ మాకు మాత్రం ముస్లింలు భారతీయులు అని ప్రధాని మోదీ అన్నారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. సీఏఏను అంత తొందరగా ఎందుకు అమలు చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారని, దేశాన్ని మతం పేరుతో విభజిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నా యని మోదీ అన్నారు. కొన్ని దశాబ్దాల నుంచి పాకిస్థాన్‌ ‌కూడా ఇదే భాషను వాడుతున్నదని, ముస్లింలను పాక్‌ ‌రెచ్చగొడుతున్నదని, ఇప్పుడు మన ప్రతిపక్షాలు కూడా అదే చేస్తున్నాయన్నారు. ఒకరు ప్రధాని కావాలని, దేశాన్ని విభజించారని మోదీ పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శించారు. పాక్‌లో ఉన్న మైనార్టీలను రక్షించాలని పండిట్‌ ‌నెహ్రూ కోరుకున్నారని, మరి నెహ్రూ మతాభిమానా లేక ఆయన హిందూ దేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారా అని కాంగ్రెస్‌ ‌పార్టీని మోదీ ప్రశ్నించారు. 1950లో నెహ్రూ-లియాకత్‌ ఒప్పందం జరిగిందని, పాక్‌లో ఉన్న మైనార్టీలను రక్షించాలని ఆ ఒప్పందం జరిగిందని, మరి అప్పుడు వాళ్ళెందుకు వివిధ మతస్తులను ఆ ఒప్పందంలో చేర్చుకోలేదని ప్రశ్నించారు. అప్పుడు నెహ్రూ ఎదుర్కొన్న పరిస్థితి, ఇప్పుడూ ఉందన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నంత సేపు అధికారపక్ష సభ్యులు బల్లలు చరచి అభినందించారు.

Leave a Reply