నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి ఎన్నికైన నూతన చైర్మన్ కల్పనభాస్కర్ గౌడ్ ,వైస్ చైర్మన్ బాబురావు లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి,తెరాస రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్ రెడ్డి ఆద్వర్యంలో గురువారం తెలంగాణ రాష్ట్ర పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నాగర్ కర్నూల్ అభివృద్ధి కార్యక్రమాలగురించి కేటీఆర్ కు వివరించారు.నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ అభివృద్ధి కి సహకారాన్ని అందించాలని ఆయనను కోరారు. కేటీఆర్ స్పందిస్తూ నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ అభివృద్ధికి తమ వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
కేటీఆర్ ను కలిసిన వారిలో కౌన్సిలర్లు జక్క రాజుకుమార్,కొత్త శ్రీనివాసులు ,తేజ ,బాదం సునీత,ఆలూరు విజయమ్మ, నాయకులు భాస్కర్ గౌడ్ , మోతి తదితరులు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన చైర్మైన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ లకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Tags: Chairmen , Vice Chairmen, KTR, nagar kurnool