గుంటూరు,జూలై 24 : మహిళ మెడలో గొలుసు దొంగతనం చేసిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు దాచేపల్లి పోలీస్ స్టేషన్లో గురజాల రూరల్ సిఐ ఉమేష్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన సాయంత్రం 5గంటల సమయంలో పోందుగుల రామాపురం రోడ్డు మద్యలో రాధిక అనే మహిళ మెడలో నాన్తాడు దోంగతనం జరిగిందని వచ్చిన ఫిర్యాదుతో తక్షణమే దాచేపల్లి యస్ ఐ,బాల నాగిరెడ్డి, రహమతుల్లాలు సిబ్బందితో కలసి దర్యాప్తు చేసి 24 గంటలు గడిచే లోపే పట్టుకోవడం జరిగింని అన్నారు. వాడపల్లి హైస్కూల్ లో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న పునగం రాధిక ,భర్త కృష్ణ మోహన్ లు స్కూల్ ముగించికుని తిరిగి వస్తుండగా పోందుగుల రామాపురం రోడ్డు మద్యలో ఐదుగురు నిందితులు రాధిక కృష్ణ మోహన్ లపై దాడి చేసి రాధిక మెడలో ఉన్న ఐదు సవర్ల నాన్ తాడు లాక్కోని పరారయ్యరు.
బాధితుల ఫిర్యాదు తో 24 గంటల్లో నిందితులను పట్టుకోవటం జరిగిందన్నారు. ప్రధాన నిందితుడు రాధిక పనిచేస్తున్న అదే స్కూల్ టీచర్ భర్త కందిమళ్ళ శ్రీనివాస రెడ్డి వారిపై ఉన్న ఈర్ష ద్వేషంతో ఇటువంటి ఘాతకానికి పార్పడాడని శ్రీనివాసరెడ్డికి సహకరించిన మరో వ్యక్తి దాడి చేసిన ఐదుగురు మొత్తం ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసామన్నారు. ఎంతో చాకచక్యంగా కేసును చేధించిన యస్ ఐ.బాల నాగిరెడ్డి, రహమతుల్లా ని వారి సిబ్బందిని అభినంధించారు.