Take a fresh look at your lifestyle.

దృవీకరణ పత్రాలు నిబంధనల మేరకు పరిశీలించాలి

ఏజన్సీ ఏరియా దృవీకరణపత్రాల పరిశీలన విషయంలో ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించాలని సంబంధిత ఐదు జిల్లాల తహశీల్దార్లను ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్‌ ‌పొట్రూ ఆదేశించారు. మంగళవారం నాడు ఐటిడిఏ పిఎన్‌ఆర్‌సి సమావేశ మందిరంలో వివిధ ఉద్యోగులకు అర్హత సాధించిన అభ్యర్దుల ఏజన్సీ దృవీకరణ పత్రాలు గత పరిశీలనలో ఇంకా మిగిలిన టిఆర్‌టి , పోలీస్‌ ‌కానిస్టేబుల్‌ , ఎఫ్‌బిఓ అంగన్‌వాడీ జూనియర్‌ ‌పంచాయితీ సెక్రటరీ లు హెచ్‌డబ్ల్యూ సుమారు 180 మంది అభ్యర్ధులకు ఏజన్సీ దృవీకరణ పత్రాల పరీశీలన చేసినట్లు పిఓ తెలిపారు. సంబంధిత నివేధికలను జిల్లా కలెక్టర్‌కు అందచేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

ఈ సందర్బంగా పిఓ మాట్లాడుతూ ఏజన్సీ ఏరియాలో గిరిజన అభ్యర్దులు వివిధ ఉద్యోగాలకై దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన వారికి దృవీకరణ పత్రాలు మరియు ఏజన్సీ దృవీకరణ పత్రాలు పరీశీలన చేయటం జరుగుతుందని సంబంధిత అధికారులు తహశీల్దారులు జారీ చేసేటప్పుడు ప్రభుత్వ నిబంధనలకు తప్పక పాటించాలని ఎట్టి పరిస్థితుల్లోను నకిలి దృవీకరణ పత్రాలు జారీ చేసినట్లైతే ఉద్యోగాల అర్హత పొందిన సంబంధిత పత్రాలు నకిలీవని తెలిస్తే వారి ఉద్యోగం కోల్పోయిన వారవుతారని , అభ్యర్దులకు అన్యాయం చేసిన వారమవుతామని హెచ్చరించారు. ఏజన్సీ ఏరియా దృవీకరణ పత్రాల పరిశీలనలో అభ్యర్దులు స్థానికత వారి భూములు తాతల ముత్తాతల కాలొస్త్రం నుండి ఉంటున్నారా లేదా బంధువర్గం సంబంధిత దృవపత్రాలు పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం వారి పొందిన ఏజన్సీ దృవీకరణ పత్రం నిజమైనదిగా నిర్ధారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్‌ఇటిసిఆర్‌ అం‌డ్‌ ‌టి హైద్రాబాద్‌ ‌లీల, మహబూబాబాద్‌ ఆర్‌డిఓ కొమరయ్య, కొత్తగూడెం ఆర్‌డిఓ స్వర్ణలత, ఖమ్మం ఆర్‌డిఓ రవీంధ్రనాధ్‌, ‌నాలుగు జిల్లాల తహశీల్దార్లు పాల్గొన్నారు.

Leave a Reply