Take a fresh look at your lifestyle.

కేంద్ర నిధులతో కెసిఆర్‌ ‌సోకు

  • డబ్బుల లెక్కలు చెప్పడానికి సిద్ధం
  • అన్ని వర్గాలూ బిజెపికి వోట్లేసి గెలిపించాలి
  • సాగర్‌ ఉప ఎన్నిక చివరి రోజు ప్రచారంలో బండి సంజయ్‌, ‌విజయ ‌శాంతి

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారం ముగింపునకు రావడంతో బిజెపి ప్రచార ఉధృతి పెంచింది. గురువారం చివరి రోజు కావడంతో బీజేపీ నేతలు బండి సంజయ్‌, ‌విజయశాంతి, వివేక్‌ ‌వెంకటస్వామి నియోజకవర్గంలో ప్రచారం చేసారు. ఆ సందర్భంగా బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ..రబ్బర్‌ ‌చెప్పులు, జీన్‌ ‌పాయింట్లు వేసుకున్న యువత దుబ్బాక, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలలో సత్తా చూపారని..సాగర్‌లో కూడా సత్తా చూపాలని కోరారు. ‘కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నది. కేంద్రం ఇచ్చిన డబ్బులతో సాగర్‌లో అభివృద్ధి చేయకుండా.. సీఎం పెగ్గు వేస్తుండు. కేంద్రం తెలంగాణకు ఎన్ని కోట్లు ఇచ్చిందో లెక్కలతో చెబుతా. కేంద్ర నిధులతో మరుగుదొడ్లను నిర్మిస్తే.. వాటిపై గద్ద ముక్కు కేసీఆర్‌ ‌బొమ్మలు పెట్టుకుంటుండు అని ఎద్దేవా చేశారు.  కేటీఆర్‌ ‌తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావ్‌? ‌నీ అయ్యను అడుగు బీజేపీ బండి సంజయ్‌ ఎవడో చెబుతాడు. సుష్మా స్వరాజ్‌ ‌తెలంగాణ కోసం పార్లమెంట్‌లో మద్దతిచ్చింది గుర్తు లేదా? ఇద్దరు ఎంపీలున్న టీఆర్‌ఎస్‌ ‌పార్టీ తెలంగాణ తెచ్చిందా? అంటూ సంజయ్‌ ‌ప్రశ్నలు గుప్పించారు. 17న సాగర్‌ ‌ప్రజలు టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ అవినీతి బాగోతం బయట పెట్టి జైలుకు పంపిస్తాం. బీజేపీ బడుగు బలహీన వర్గాల పార్టీ, రవి కుమార్‌ ‌నాయక్‌ ‌పేదోళ్ల బిడ్డ. సాగర్‌లో పేదోళ్లకు పెద్దోళ్ళకు జరుగుతున్న పోరు ఇది. ప్రజలు ఎటు ఉంటారో ఆలోచించుకోవాలన్నారు. ‘సాగర్‌లో మందు ఏరులై పారుతుంది. టీఆర్‌ఎస్‌ ‌నాయకులు విచ్చలవిడిగా పంచుతున్నారు. రవి నాయక్‌ను గెలిపించిన తర్వాత హాలియాలో విజయోత్సవ సభ పెడతాం’ అని సంజయ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌కు వణుకు పుట్టిస్తామని విజయశాంతి అన్నారు. ప్రజలు బీజేపీకి అండగా ఉంటే కేసీఆర్‌ ‌మెడలు వంచుతామన్నారు. జై తెలంగాణ, వీర తెలంగాణ అంటూ గళమెత్తిన ప్రజలు.. మరోసారి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ అన్నీ అబద్దాలు మాట్లాడుతున్నారని, ఆయనది దోపిడీ పాలని అంటూ ధ్వజమెత్తారు. ‘సావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చానని కేసీఆర్‌ అం‌టున్నారు. ఆయన సావు నోట్లో తల పెట్టలే ప్రజల తలలు పెట్టిండు. కేసీఆర్‌వన్నీ అబద్దాలే.

విద్యార్థుల బలిదానాలు, సకల జనుల సమ్మె, పోరాటాలతోనే రాష్ట్రం వొచ్చింది. దొర అధికారంలోకి వొచ్చాక ఎన్నో హావి•లు ఇచ్చారు. కానీ ఒక్కటీ నెరవేరలేదు. రెండోసారి కూడా హావి•ల వర్షం కురిపించారు. అవీ చేయలే. ఉద్యోగాలు, డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇం‌డ్లు, భగీరథ నీళ్లు, మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి ఎక్కడ దొరా? తెలంగాణ బిడ్డలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదు’ అని విమర్శల వర్షం కురిపించారు. ‘దొర కాళ్లు పట్టి నేలకు కొట్టాలె. పోరాడే పార్టీ బీజేపీ. ప్రజలకు అండగా ఉంటుంది. కదలిరండి.. దొర మెడలు వంచుదాం. మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రవి కుమార్‌ను గెలింపించాలి’ అని విజయశాంతి కోరారు. తెలంగాణ వొచ్చాక రాష్ట్రాన్ని అనాథాశ్రమంగా మార్చారని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలే కేసీఆర్‌ను సీఎం కుర్చీలో కూర్చోపెట్టారని అన్నారు. కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌రెండూ ఒక్కటేనన్నారు. ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీకి వోటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply