Take a fresh look at your lifestyle.

ట్రాక్టర్ల ర్యాలీకి వ్యతిరేక పిటిషన్ ఉపసంహరించుకున్న కేంద్రం

  • కోర్టు వ్యవహారం కాదన్న  అత్యున్నత న్యాయస్థానం
  • శాంతి భద్రతల అంశం పోలీసు పరిధిలోనిదని వ్యాఖ్య
  •  సున్నితంగా వ్యవహరించాలి : ఆర్‌ఎస్‌ఎస్
  • ప్రధాన కార్యదర్శి సురేష్ (భయ్యాజీ) జోషి  
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ: రైతులు తమ నిరసనలో భాగంగా గణతంత్ర దినోత్సవం ట్రాక్టర్ల ర్యాలీకి వ్యతిరేకంగా రైతులపై కేంద్రం వేసిన పిటిషన్ ను కేంద్రం ఉపసంహరించుకుంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై రైతులు గట్టిగా పట్టు పడుతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిపాదిత రైతుల ట్రాక్టర్ ర్యాలీని అత్యున్నత న్యాయస్థానం నిషేధించాలి అని సుప్రీం కోర్టుకు కేంద్రం  విజ్ఞప్తి చేయగా.. ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం సరికాదని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. రైతుల నిరశనపై కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం కుదరదు అని తెలిపిన  ధర్మాసనం, నిరసనలు నిర్వహించుకోవడంకి సంబంధించి ఢిల్లీలోకి ఎవరిని అనుమతించాలి ఎవరిని అనుమతించకూడదు అనేది శాంతిభద్రతల విషయం కిందికి వస్తుంది. కనుక ఈ విషయం పోలీస్ విభాగం కిందకి వస్తుంది. ఇది కోర్టు వ్యవహారం కాదు అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.
రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చట్టాలు రద్దు చేయాలన్న డిమాండ్‌పై గణతంత్ర దినోత్సవం నాడు ప్రతిపాదిత ట్రాక్టర్ ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నారు. రైతులతో మాట్లాడుతున్న పోలీసులు రైతులకి తమ ట్రాక్టర్ ర్యాలీ KMP ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్వహించాలని, కిసాన్ ఘాట్ వైపు లేదా ఇతర మార్గాల్లో కవాతు తీసుకు రావద్దని రైతులకు చెబుతున్నారు. అయితే పోలీసులు చెప్పిన రూట్ లో వెళ్ళటానికి రైతులు నిరాకరిస్తున్నారు. రైతుల ఆందోళన 56వ రోజులోకి ప్రవేశించడంతో, వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రభుత్వం, నిరసన వ్యక్తం చేస్తున్న రైతు ప్రతినిధుల మధ్య పదవ రౌండ్ చర్చలు బుధవారం జరుగుతాయి. మొదట మంగళవారం నాడు చర్చలకి ప్రణాళిక సిద్ధం చేసినా కూడా బుధవారంకి చర్చలు వాయిదా పడ్డాయి.
మరో వైపు సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ మంగళవారం ఢిల్లీలో తన మొదటి సమావేశాన్ని నిర్వహించింది. రైతు సంస్థలు మరియు ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకుంటున్నాం. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను “ఒప్పించడానికి” ప్రయత్నిస్తామని సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ  సభ్యులు చెప్పారు. కమిటీకి ఎన్నుకోబడిన సభ్యులపై రైతు సంఘాలలో ఆందోళనల నెలకొని వుంది.
కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం రైతులతో  వ్యవహరించేటప్పుడు. ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలి అని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సురేష్ (భయ్యాజీ) జోషి అన్నారు. చర్చలు.. మధ్యవర్తిత్వం.. సమస్య పరిష్కారం జరిగేవరకు ఇరు పక్షాలు తప్పక పాటించాలి అని అన్నారు. “ఏ ఆందోళన అయినా ఎక్కువ కలం నడపడం వలన సమాజ ఆరోగ్యానికి మంచిది కాదు” అని సురేష్ (భయ్యాజీ) జోషి నొక్కి చెప్పారు. ఆందోళన త్వరగా ముగియాలని కోరుకుంటున్నాము అని జోషీ అన్నారు. అధికార పార్టీ వెన్ను అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నెం.2 నుండి ఈ ప్రకటనలు రావటం అన్నది మోడీ షాలకి మెసేజింగ్ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ప్రతిష్టంభన నుండి బయటపడటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నెం.2 నుండి ఈ ప్రకటనలు రావటం కొంత  ప్రాముఖ్యత సంతరించుకుంది.

Leave a Reply