- మహారాష్ట, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, చత్తీస్ గఢ్
- కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు బహుముఖీన ఉన్నతస్థాయి
- 7 రాష్ట్రాలతో కాబినెట్ కార్యదర్శి సమీక్షకు ఏర్పాట్లు
- భారత్ లో 1.26 కోట్లు దాటిన మొత్తం కోవిడ్ టీకాలు
భారతదేశంలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కొవిడ్ కేసుల సంఖ్య1,51,708 కాగా, ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 1.37%. నిజానికి ఈ పెరుగుదలకు కారణం మహారాష్ట,కేరళ,పంజాబ్,మధ్యప్రదేశ్,తమిళనాడు,గుజరాత్,చత్తీస్ గఢ్ లలో అకస్మాత్తుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నకేసులే. గత 24 గంటలలో16,738కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో 89.57%కేవలం ఈ ఏడు రాష్ట్రాలలో నమోదైనవే కావటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా8,807కొత్త కేసులు రాగా కేరళలో4,106, పంజాబ్ లో558 నమోదయ్యాయి.ఈ రాష్టాలు•- మహారాష్ట,కేరళ,కర్నాటక, పంజాబ్,మధ్యప్రదేశ్,తమిళనాడు,పశ్చిమ బెంగాల్,చత్తీస్ గఢ్ లకు కేంద్ర ప్రభుత్వం బహుముఖీనమమైన అత్యున్నత స్థాయి బృందాలను హుటాహుటిన పంపింది. ఆయా రాష్టాలలో ఇలా అకస్మాత్తుగా కేసులు పెరగటానికి కారణాలను అధ్యయనం చేయటంతోబాటు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ కోవిడ్ ను నియంత్రించటం ఈ బృందాల లక్ష్యం.వ్యాధి వ్యాపించకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని కేందప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు కూడా రాసింది. ఈ రాష్టాలు కోవిడ్ వ్యాధి నిర్థారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాలని సూచించింది.
నెగటివ్ యాంటిజెన్ పరీక్షఫలితాలు వెలువడిన సందర్భాలలో ఆర్ టి-పిసిఆర్ పరీక్షల వైపు తప్పని సరిగా మొగ్గు చూపాలని కోరింది. పాజిటివ్ గా నిర్థారణ అయినవారిని వెంటనే ఐసొలేషన్ కు తరలించటం లేదా హాస్పిటల్స్ లో చేర్చటం, వాళ్ళద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నవాళ్లను గుర్తించటంలో చికిత్స అందించటంలో ఎక్కడా అలక్ష్యం తగదని కేంద్రం హెచ్చరించింది. జిల్లా అధికారులు క్రమం తప్పకుందా పురోగతిని తెలియజేయాలని ఆదేశించింది.మరోవైపు దేశమంతటా మొత్తం పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. 2021 ఫిబ్రవరి 25 నాటికి పాజిటివ్ శాతం 5.17% గా నమొదైంది.గురువారం ఉదయం 7 గంటలకు 1,26,71,163మందికి 2,64,315 శిబిరాల ద్వారా టీకాలు వేసినట్టయింది.ఇందులో 65,47,831 మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ అందుకున్నవారు ఉండగా 16,16,348మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ అందుకున్నారు. 45,06,984మంది కోవిడ్ యోధులు మొదటి డోస్ తీసుకున్నారు. రెండో డోస్ కోవిడ్ టీకాల కార్యక్రమం ఫిబ్రవరి 13న మొదలైంది. మొదటి డోస్ తీసుకొని 28 రోజులు పూర్తి చేసుకున్న వారు రెండో డోస్ కు అర్హులయ్యారు.
మొదటి విడత కొవిడ్ యోధుల టీకాలు ఫిబ్రవరి 2న మొదలైన సంగతి తెలిసిందే..టీకాలు మొదలైన 40 వ రోజైన ఫిబ్రవరి 24న 5,03,947 టీకాలిచ్చారు. అందులో2,87,032 మంది లబ్ధిదారులు (ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు)9,959 శిబిరాల ద్వారా మొదటి డోస్ టీకాలు తీసుకోగా 2,16,915మంది ఆరోగ్యసిబ్బంది రెండో డోస్ టీకా తీసుకున్నారు.మొత్తం 1,26,71,163 టీకా డోసులలో 1,10,54,815డోసులు ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు మొదటి డోస్ తీసుకోగా 16,16,348 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ టీకా తీసుకున్నారు.మొత్తం తీసుకున్న టీకా డోసులలో 56% వాటా ఎనిమిది రాష్టాలదే. అన్నిటిలోనూ ఆరేసి లక్షలకు పైగా టీకాలపంపిణీ జరిగింది. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 9.68% (12,26,775 డోసులు) ఇచ్చారు.రెండో డోసు టీకాలలో 61% ఎనిమిది రాష్టాలలో తీసుకున్నారు. కర్నాటకలో అత్యధికంగా రెండో డోస్ ఆరోగ్య సిబ్బందికి 11.08% (1,79,124) డోసుల.టీకాలు వేశారు.
12 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 80% పైగా అర్హులైన ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నారు. అవి: లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్మ్ నాగాలాండ్, డామన్-డయ్యూ, అండమాన్-నికోబార్ దీవులు, లక్షదీవులు, కేరళ, గుజరాత్, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్, సిక్కిం రిజిస్టర్ చెసుకున్న కోవిడ్ యోధులలో 60% పైగా టీకాలు తీసుకున్నట్టు నమోదైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 10. అవి: డాద్రా-నాగర్ హవేలి, రాజస్థాన్, లక్షదీవులు, గుజరాత్, మధ్యప్రదేశ్మ్ త్రిపురమ్ ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, చత్తీస్ గఢ్. భారతదేశంలొ ఇప్పటివరకు కోవిడ్ బారి నుంచి బైటపడినవారి సంఖ్య 1,07,38,501 కు చేరింది. కోలుకున్నవారి శాతం 97.21%. కోలుకున్నవారికి, చికిత్సపొందుతూ ఉన్నవారికీ మధ్య తేడా పెరుగుతూ 1,05,86,793 కు చేరింది. గత 24 గంటలలో 11,799 మంది కోలుకున్నారు.