Take a fresh look at your lifestyle.

నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో.. రెండో రోజు పర్యటించిన కేంద్ర బృందం

అధికారులు, స్థానిక ప్రజల నుండి వివరాల సేకరణ

నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో రెండో రోజు ఎల్బీనగర్‌, ‌ఖైరతాబాద్‌ ‌జోన్లలో కేంద్ర బృందం పర్యటించి, వరద ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధిత కుటుంబాలతో వివరాలను సేకరించింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ ‌వశిష్ఠ నాయకత్వంలో కేంద్ర జలవనరుల విభాగం సూపరింటెండెంట్‌ ఇం‌జనీర్‌ ఎం ‌రఘురామ్‌, ‌కేంద్ర రోడ్‌ ‌ట్రాన్స్పోర్ట్ ‌విభాగం సూపరింటెండెంట్‌ ఇం‌జనీర్‌ ఎస్‌ ‌కె కుష్వారా లు నగరంలో పర్యటించారు. జిహెచ్‌ఎం‌సి జోనల్‌ ‌కమిషనర్లు ఉపేందర్‌ ‌రెడ్డి, ప్రావిణ్య, చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌జియాఉద్దీన్లు కమిటీతో పాటు పర్యటించి ఆయా ప్రాంతాలలో నెలకొన్న వరద పరిస్థితి, ప్రభుత్వపరంగా చేపట్టిన సహాయ, పునరావాస, పునరుద్ధరణ పనుల గురించి కమిటీకి తెలిపారు.

దెబ్బతిన్న రోడ్లు, నాలాలు, చెరువు కట్టలు పునరుద్ధరణకు చేపట్టిన చర్యల గురించి అధికారుల నుండి వివరాలు తీసుకున్నది. కొన్ని ప్రాంతాల్లో నాలాలు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తున్నందున, చెరువుల పటిష్టతకు, నాలాల విస్తరణకు చేపడుతున్న చర్యల గురించి అధికారులు వివరించారు. నాగోల్‌, ‌బండ్లగూడ, బైరామల్‌గూడ చెరువుల నాలాల నుండి వొచ్చే వరద నీటిని మూసిలో కలిపేందుకు శాశ్వత ప్రాతిపదికన నాలాలను అభివృద్ధి చేయనున్నట్లు నీటి పారుదల, జిహెచ్‌ఎం‌సి అధికారులు తెలిపారు. అందుకు అనువుగా డిజైన్లను రూపొందించుటకై కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నట్లు వివరించారు. నాగోల్‌, ‌బండ్లగూడ చెరువుల నుండి ఓవర్‌ ‌ఫ్లో అయి నాలాలలోకి వస్తున్న, వరద నీరు, వరద ముంపుతో జరిగిన నష్టం గురించి అధికారులు, స్థానిక ప్రజల నుండి వివరాలు తెలుసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply