Take a fresh look at your lifestyle.

నగరంలో విస్తృతంగా పర్యటించిన కేంద్ర బృందం

గండ్లు పడిన చెరువులు, రోడ్లు, నాలాల పునరుద్దరణ పనుల పరిశీలన

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌భారీ వర్షాలు, వరదలతో ఏర్పడిన నష్టాన్ని పరిశీలిచేందుకు రెండు రోజుల పర్యటనకై రాష్ట్రానికి వొచ్చిన కేంద్ర బృందం. నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ముంపుకు గురైన కాలనీలను, ఇళ్లను, దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, చెరువులను, రోడ్లు, చెరువుల పునరుద్దరణకు చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ ‌వశిష్ట నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ఇంటర్‌ ‌మినిస్టేరియల్‌ అధికారుల బృందంలోని ముగ్గురు సభ్యులు హోం శాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్‌ ‌విశిష్టతో పాటు జలవనరుల విభాగం సూపరింటెండెంట్‌ ఇం‌జనీర్‌ ఎం.‌రఘురాం, రోడ్‌ ‌ట్రాన్స్పోర్ట్, ‌హై-వేస్‌ ‌సూపరింటెండెంట్‌ ఇం‌జనీర్‌ ఎస్‌.‌కె.కుష్వారాలు నగరంలో పర్యటించారు. మిగిలిన ఇద్దరు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం సెక్రటేరియట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ఇతర శాఖల ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం వీరు చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా వద్ద దెబ్బతిన్న ఆర్‌ఓబిని, ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. వరద బాధిత ప్రజలతో మాట్లాడిన కేంద్ర బృందం ఆర్‌ఓబికి రెండు వైపుల చేపట్టిన పునరుద్దరణ, నాలా నుండి తొలగిస్తున్న పూడిక తీత పనులను పరిశీలించారు. భారీ వర్షాలు, వరదలతో తమ ఇళ్ల గ్రౌండ్‌ ‌ఫ్లోర్తో పాటు మొదటి అంతస్తులోకి కూడా నీళ్లు వచ్చినట్లు ఈ ప్రాంత ప్రజలు కేంద్ర కమిటికి వివరించారు.

ఇప్పటికి రోడ్లపై, ఇళ్లలోనూ నీళ్లు పేరుకుపోయి ఉన్నట్లు తెలిపారు. 10 రోజుల పాటు నీళ్లలో నానడం పట్ల తమ ఇళ్ల గోడలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ‌డి.ఎస్‌.‌లోకేష్‌ ‌కుమార్‌, ‌చీఫ్‌ ఇం‌జనీర్‌ ‌జియాఉద్దీన్‌ ‌లు మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఫలర్‌నుమా ఆర్‌ఓబిని నిర్మించినట్లు తెలిపారు. ఈ ఆర్‌ఓబి వలన ఇన్నర్‌ ‌రింగ్‌రోడ్డు, చార్మినార్‌ ‌ప్రాంతాలకు రోడ్డు సదుపాయం అనుసంధానం అయినట్లు తెలిపారు. అదేవిధంగా పల్లె చెరువు నుండి వొచ్చే వరద నీటి నాలా 7 మీటర్ల వెడల్పు ఉంటుందని, ఈ నాలా ఆర్‌ఓబి కింద నుండి వెళ్తుందని తెలిపారు. పల్లెచెరువు తెగిపోవడం వలన వొచ్చిన వరదతో ఈ ప్రాంతానికి అపార నష్టం జరిగినట్లు తెలిపారు. రైల్వే ఓవర్‌ ‌బ్రిడ్జి ఆర్‌ఓబి రిటైనింగ్‌ ‌వాల్‌ ‌దెబ్బతిన్నదని, అదేవిధంగా అనేక కాలనీలు వరద ముంపుకు గురైనట్లు తెలిపారు. రోడ్లపై 5 మీటర్ల ఎత్తున వరద నీరు నిలిచినట్లు కేంద్ర బృందానికి వివరించారు. కేంద్ర బృందం తమ పర్యటనలో భాగంగా కందికల్‌ ‌గేట్‌ ‌వద్ద ఉన్న నాలా పునరుద్దరణ పనులను పరిశీలించింది. అనంతరం చాంద్రాయణగుట్ట పూల్బాగ్‌లోని వరద ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యులు అసదుద్దీన్‌ ఓవైసి కేంద్ర బృందాన్ని కలిసి వరదలతో జరిగిన నష్టాన్ని గురించి వివరించారు. దాదాపు 10 అడుగులకు పైగా రోడ్లు, ఇళ్లు వరదముంపుకు గురయ్యాయని, ప్రజలు తీవ్రంగా నష్టపోయినందున కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కేంద్ర బృందం బాలాపూర్‌, ‌హఫీజ్‌ ‌బాబానగర్‌లో సందర్శించింది. పల్లె చెరువు, గుర్రం చెరువులు తెగిపోవడంతో బాలాపూర్‌ ‌చెరువు ఓవర్‌ ‌ఫ్లో అయి హఫీజ్‌ ‌బాబానగర్‌ ‌లోని కాలనీలు, ఇళ్లను ముంచెత్తడంతో పలు ఇళ్లు, ప్రహరీగోడలు కూలిపోయి ఇళ్లలోని ఫర్నీచర్‌, ‌నిత్యావసర వస్తువులు వరదపాలైనట్లు ప్రజలు తమ గోడును వెల్లబుచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply