- వరద నష్టంపై వివరాలు సేకరణ
- వరదలపై ఫోటో ఎగ్జిబిషన్ తిలకించిన అధికారులు
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో వరదల నష్టాన్ని కేంద్ర బృందానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వివరించారు. బీఆర్కేఆర్ భవన్లో సీఎస్‌తో కేంద్ర బృందం భేటీ అయ్యింది. ఈ సందర్బంగా సిఎస్ వారితో చర్చించి నష్టం వివరాలను అందచేశారు. అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. వరద ప్రాంతాల్లో పరిస్థితులను కేంద్ర బృందానికి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ వివరించారు. రెండు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలో వరద పరిస్థితిని కేంద్రం బృందం అధ్యయనం చేయనుంది.
అలాగే పాతబస్తీ చంద్రాయణ గుట్ట పల్లె చెరువు, ఇతర వరద ముంపు ప్రాంతాలను ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం సందర్శించారు. మరో ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం సిద్దిపేట వెళ్లారు. జిల్లాల్లో పంట నష్టాన్ని కూడా కేంద్రబృందం అంచనా వేయనుంది. పర్యటన తరవాత రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్రానికి ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం నివేదిక ఇవ్వనుంది. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో అపారమైన ఆస్తి, ప్రాణ నష్టం కూడా సంభవించింది. కాగా.. భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు… కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలో అధికారుల బృందం తెలంగాణకు చేరుకుని వరద నష్టాన్ని అంచనా వేస్తోంది.