Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడిలో కేంద్రరాష్ట్రాలు విఫలం

గాంధీకి వెళ్లిన జూడాల సమస్యలు గుర్తించని కెసిఆర్‌
‌కెన్యా లాంటి దేశాలు కూడా మనకు సాయం చేయడందౌర్భాగ్యం: పొన్నాల
ప్రజల ప్రాణాలు కాపాడే ప్రాధాన్యతను సీఎం కేసీఆర్‌ ‌గుర్తించలేదని, కాంగ్రెస్‌ ‌నేత పొన్నాల లక్ష్మయ్య దుయ్యబట్టారు. ఏడేళ్ల తర్వాత గాంధీకి వెళ్లిన కేసీఆర్‌ ‌జూడాలు సమ్మెకు దిగే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. కొరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కెన్యా కూడా మనకు సహాయం చేసే పరిస్థితికి రావడం తలదించుకునే విషయమని పొన్నాల వ్యాఖ్యా నించారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు పూర్తిగా పడిపోయిందన్నారు.

ప్రధాని మోదీ పాలనలో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మసకబారిందని తప్పుబట్టారు. ప్రాణాలు కాపాడే మందుల వి•ద కూడా జీఎస్టీ వేయడం దౌర్భాగ్యమన్నారు. భేషజాలకు పోకుండా ప్రతిపక్షాల సలహాలు తీసుకోవాలని పొన్నాల లక్ష్మయ్య సూచించారు. ఏడేళ్ల తర్వాత గాంధీకి వెళ్లిన ముఖ్యమంత్రి… జూనియర్‌ ‌డాక్టర్లు సమ్మెకు దిగే పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. కొరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పొన్నాల విమర్శించారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు పూర్తిగా పడిపోయిందని, మోదీ పాలనలో అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మసకబారిందన్నారు. ప్రాణాలు కాపాడే మందుల వి•ద కూడా జీఎస్టీ వేయడం దౌర్భాగ్యమని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

Leave a Reply