Take a fresh look at your lifestyle.

జేఎన్‌యూ ఘటనపై కేంద్రం సీరియస్‌

  • దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర మంత్రి అమిత్‌షా
  • దాడిని తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌
  • ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న గూండాయిజాన్ని దేశమంతా చూస్తోందన్న కాంగ్రెస్‌
  • విద్యార్ధులకు వర్శిటీలోనే రక్షణ లేకపోవటం దారుణం: ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌

JNU campus violation

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని జవహర్‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం సాయంత్రం జరిగిన హింసాకాండ కేసు దర్యాప్తు బాధ్యతను సోమవారం ఢిల్లీ క్రైబ్రాంచ్‌ ‌విభాగానికి బదిలీచేశారు. జేఎన్‌యూ హింసాకాండపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు బాధ్యతను క్రైబ్రాంచ్‌ ‌విభాగానికి అప్పగించారు. క్రైబ్రాంచ్‌ ‌పోలీసులు ఈ హింసాకాండపై ఆధారాలు సేకరించే పని ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తు కోసం మూడు ప్రత్యేక క్రై బ్రాంచ్‌ ‌పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ముసుగులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌, ‌సోషల్‌ ‌డియా ఫుటేజ్‌లను సేకరించారు. సోమవారం ఉదయం జేఎన్‌యూ రిజిస్ట్రార్‌, ‌పీఆర్వో, వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌లు ఢిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ అనిల్‌ ‌బైజాల్‌ ‌ను కలిశారు. కేంద్ర మంత్రి ఆదేశంతో ఢిల్లీ లెప్టినెంట్‌ ‌గవర్నర్‌ అనిల్‌ ‌బైజాల్‌ ‌సోమవారం ఉదయం జేఎన్‌యూ అధికారులతో పరిస్థితిని సక్షించారు. ఢిల్లీలోని ఎయిమ్స్, ‌సప్దర్‌ ‌జంగ్‌ ఆసుపత్రుల్లో 35మంది విద్యార్థులు గాయపడి చికిత్స పొందుతున్నారు. యూనివర్శిటీల ఆగంతకుల దాడి నేపథ్యంలో సోమవారం పోలీసులు ప్లాగ్‌ ‌మార్చ్ ‌జరిపారు. ముసుగులు ధరించిన 50 మందికి పైగా దుండగులు వర్సిటీ ప్రాంగణంలోని సబర్మతి, మహిమాండ్వి, పెరియార్‌ ‌హాస్టళ్లలోకి చొరబడి లాఠీలు, రాడ్లు, సుత్తులతో అధ్యాపకులపై, విద్యార్థులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

ఈ దాడిలో వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్‌ ‌తల పగిలింది. తీవ్రంగా గాయపడిన 18మంది ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడిని ఖండించిన జేఎన్‌ ‌యూ పరిపాలన విభాగం అధికారులు దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. నాజీ పాలనలా ఉంది – కాంగ్రెస్‌ ‌విమర్శ దేశ రాజధానిలోని జవహార్‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థులపై ఆదివారం జరిగిన దాడిని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ ప్రోద్బలంతో జరుగుతున్న ఈ గుండాయిజాన్ని దేశమంతా చూస్తోందని, జేఎన్‌యూ ఘటన 90ఏళ్ల నాటి నాజీ పాలనను తలపిస్తోందని ఆరోపించింది. జేఎన్‌యూ ఘటనపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ ‌సింగ్‌ ‌సుర్జేవాలా సోమవారం విలేకరులతో మాట్లాడారు. యువతతో ఎందుకు శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారని ప్రశ్నించారు. యువ స్వరాన్ని ఎంత అణచివేయాలని ప్రయత్నిస్తే.. అది అంత ధైర్యంగా మారుతుందని అన్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో నిన్నటి దాడి నాటి నాజీ పాలనను తలపిస్తోందని, ప్రభుత్వ ప్రోత్సాహంతో జరుగుతున్న గూండాయిజాన్ని యావత్‌ ‌దేశం చూస్తోందని, పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందని, అయినా వారే పట్టించుకోలేదని దీన్ని బట్టి చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం లేదని అనిపిస్తోందని సుర్జేవాలా దుయ్యబట్టారు.విద్యార్ధులకు వర్శిటీలోనే రక్షణ లేకపోవటం దారుణం – సీఎం కేజీవ్రాల్‌ ‌జెఎన్‌యులో హింసాకాండపై సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

విశ్వవిద్యాలయంలోనే విద్యార్ధులకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ వారి సురక్షితంగా ఉండగలరు అని ప్రశ్నించారు. విద్యార్ధులపై దాడులు చేస్తుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆవేదనగా ప్రశ్నించారు. జేఎన్‌ ‌యూలో జరిగిన విద్యార్దులు..లెక్చరర్లపై జరిగిన దాడికి సీఎం కేజీవ్రాల్‌ ‌తీవ్రంగా ఖండించారు. సీఎం కేజీవ్రాల్‌ ‌జెఎన్‌యులో హింస గురించి వింటుంటూ చాలా ఆశ్చర్యంగా ఉందని ట్వీట్‌ ‌చేశారు. విద్యార్థులపై దారుణంగా దుండగులు తీవ్రంగా దాడి చేశారనీ పోలీసులు దీనిపై ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు వెంటనే వర్శిటీలో హింసను ఆపి శాంతిని పునరుద్ధరించాలని అన్నారు. జేఎన్‌యు క్యాంపస్‌లో హింస ఘటనపై సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా మంది ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు, మంత్రులు పాల్గొన్నారు. వాళ్లు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చారు కాబట్టే ఈ దాడులు జరిగాయ్‌ – అసుద్దీన్‌ ‌జవహర్‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో జరిగిన హింసాత్మక ఘటనను ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. నిరసన చేస్తున్న విద్యార్ధులను ఉద్దేశపూర్వకంగా శిక్షించేందుకే ఈ క్రూరమైన దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న వారు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వడం వల్లే.. దుండగులు దాడికి తెగబడ్డారని అన్నారు. పిరికిపందల్లాగా ముసుగులు ధరించి యూనివర్శిటి విద్యార్ధులపై రాడ్లు, కర్రలతో దాడిచేయడం ఉపేక్షించలేని చర్యగా ఒవైసీ తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారని, పోలీసులు ఎందుకు ఆ గూండాలకు రక్షణగా ఉన్నారో మోదీ సర్కార్‌ ‌చెప్పాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు.

Tags: JNU violation attack, mim asaduddin owaisi, arvindh kegriwal, congress party, rahul gandhi, amitshah

Leave A Reply

Your email address will not be published.