Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్యాకేజ్‌ ‌టెలికోలను గట్టెక్కించేనా!

ప్రపంచ ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక రంగాలలో   సమాచార వ్యవస్థ పాత్ర ఎనలేనిది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో సమాచార రంగం రోజు రోజు కి కొత్త పుంతలు తొక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సమాచార రంగ సాధనాలలో ప్రధానంగా టెలికాం రంగం అతి ప్రాచీనమైనదే కాకుండా దేశ ఆర్థిక పురోగతిలో ప్రభావవంతమైన పాత్రను పోషిస్తుంది.

ప్రజానికానికి ఇంటర్నెట్‌ ‌మరియు సమాచార సేవలందిస్తూ మనిషి జీవితంలో భాగమైన టెలికాం సంస్థలు రోజురోజుకి ఆర్ధిక సంక్షోభం లో కొట్టుమిట్టాడటం గమనార్హం. టెలికాం సంస్థలలో ప్రధానంగా వోడాఫోన్‌ ఐడియా ( వి.ఐ ) ఆర్థికంగా దివాలా స్థితికి చేరుకున్నాయని సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మార్చి 2021 నాటికి వోడాఫోన్‌ ఐడియా  సంస్థ నికర నష్టం 46293.70 కోట్లు. సంస్థ రుణాలు సుమారు  1.8 లక్షల కోట్లు ఉండగా, అందులో 96,270 కోట్లు స్పెక్ట్రమ్‌ ‌బాకీలు, 60 వేల కోట్లు ఏ. జి .ఆర్‌ ( ‌సవరించిన స్థూల ఆదాయం) బాకీలు . మరియు 23,080 కోట్ల మేర బ్యాంకు రుణాలున్నాయి. భారతి ఎయిర్‌ ‌టెల్‌  ‌సంస్థ ఏ. జి .ఆర్‌ ‌బాకీలు  దాదాపు 26 వేల కోట్లుండగా మార్చి 2021 నాటికి  నికర నష్టం 25197.60  గా నమోదు అయ్యింది.
టెలికాం మార్కెట్‌ ‌లో ఒక విప్లవంగా జియో ప్రవేశంతో మిగతా టెలికాం సంస్థల వ్యాపారం ఒడిదొడుకులకు లోను కావడం,  జియో కు సమానంగా పోటి పడలేకపోవడంతో సంస్థ అమ్మకాలు క్షీణించి, నష్టాలు పెరుగుతూ వస్తున్నాయి. వ్యాపార నిర్వాహణ భారంతో పాటు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు ఇబ్బడిముబ్బడిగా ఉండటం ఆయా సంస్థలు ఒత్తిడిలోకి నెట్టబడ్డాయి.

ఈ సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నంలో భాగంగా ఇటీవల కేంద్రం తాత్కాలిక ఉపశమన ప్యాకేజ్‌ ‌ప్రకటించింది. ఇందులో టెలికాం కంపెనీలు చట్టబద్ధమైన బకాయిల చెల్లింపుపై నాలుగు సంవత్సరాల తాత్కాలిక గడువు అందించడంతోపాటు, ఆటోమేటిక్‌ ‌మార్గం ద్వారా టెలికాం రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు  (ఎఫ్‌ .‌డి.ఐ ) కూడా కేంద్రం పచ్చ జెండా ఊపింది. చెల్లించని బకాయిలపై తాత్కాలిక నిషేధాన్ని మంజూరు చేయడం, సర్దుబాటు చేసిన స్థూల ఆదాయాన్ని  పునర్నిర్వచించడం ద్వారా మరియు స్పెక్ట్రమ్‌ ‌వినియోగ ఛార్జీలలో కోత పెట్టడం, టెలికాం యేతర ఆదాయాలన్నీ ఏ .జి .ఆర్‌   ‌నుండి తొలగించడం  లాంటి ఉపశమనాలు ఈ ప్యాకేజ్‌ ‌ప్రధానాంశాలు.
ఉపశమన ప్యాకేజీ, టెలికాం కంపెనీలు-వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్ ‌జియో మరియు భారతీ ఎయిర్టెల్‌ ‌సంస్థలలో  ఉపాధి అవకాశాలను మెరుగు పర్చడం, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, లిక్విడిటీని పెంచి, పెట్టుబడులను ప్రోత్సహించడం లాంటి ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకొని ప్రకటించడం జరిగిందని కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది. కేంద్ర ప్యాకేజీ ప్రభావంతో  బుధవారం టాప్‌-‌పెర్ఫార్మింగ్‌ ఇం‌డెక్స్ ‌స్టాక్లలో ఒకటి ఐన భారతి ఎయిర్టెల్‌  4.8 ‌శాతం , వొడాఫోన్‌ ఐడియా షేర్‌ ‌ధరలో 4 శాతం  మరియు రిలయన్స్ ఇం‌డస్ట్రీస్‌ (‌రిల్‌) ‌లో 0.5 శాతం పెరుగుదల చోటుచేసుకుంది.

అయితే కేంద్రం ఇచ్చిన మోరటోరియం గడువులో టెలికాం సంస్థలు తమ వ్యాపారాన్ని లాభాల బాటలో పెట్టాలంటే వినియోగదారుల సంఖ్యలో వృద్ధి తో పాటు సాంకేతిక అంశాలలో ( 5 జి  లాంటివి )మిగతా సంస్థలతో సమానమైన పోటి ఇవ్వగలగాలి . అదేక్రమంలో సంస్థ పెట్టుబడుల సమీక్ష, ఆస్తి అప్పుల పట్టిక పునర్నిర్మాణం ఈక్విటీ వాటాదారుల ఆర్జన రేటు పెంపు జరగాలి, లేనట్లయితే ఈ సమస్య సజీవంగానే ఉంటుందని చెప్పవచ్చు.

– డాక్టర్‌ ఎం ‌డి ఖ్వాజా మొయినొద్దీన్‌, ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, ‌తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కరీంనగర్‌, 9492791387

Leave a Reply