Take a fresh look at your lifestyle.

రాష్ట్రానికి కేంద్రం రూ.1558 కోట్ల జిఎస్‌టి నిధులు బకాయి..

  • ఆంధ్రాకు 1559 కోట్లు..
  • జిఎస్‌టి నిధుల కోసం అనేక రాష్ట్రాలు అల్లాడుతున్నాయి
  • ఎంపీల ప్రశ్నలకు కేంద్రం వివరణ

సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సంబంధిత మంత్రి లిఖిత పూర్వక సమాధానాలు
కేంద్రం 2020-21 మరియు 2021-22 ఆర్థిక సంవత్సరాలకు గాను వివిధ రాష్ట్రాలకు బకాయి పడివున్న జిఎస్‌టి నిధులు ఎంతో తెలంగాణ, ఆంధప్రదేశ్‌తో పాటుగా రాష్ట్రాల వారీగా వివరాలు ఎంపీలు జి.రంజిత్‌ ‌రెడ్డి, గల్లా జయదేవ్‌, ‌కే.మురళీధరన్‌, ఏ.‌రాజా కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో రాష్ట్రాలకు మొత్తం జిఎస్‌టి బకాయిలు చెల్లించిందా..? కోవిడ్‌ -19 ‌మహమ్మారి కారణంగా భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసిన రాష్ట్రాలకు అదనపు జీఎస్టీ పరిహారం అందించే ప్రణాళికలు ఏమైనా కేంద్రం దగ్గర ఉన్నాయా..? ఉంటే వివరాలు ఇవ్వమని కోరగా… ఆంధ్ర ప్రదేశ్‌కు 2493 కోట్ల జిఎస్‌టి నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉండగా 1559 కోట్ల జిఎస్‌టి నిధులు కేంద్రం ఇంకా చెల్లించలేదని వెలుగులోకి వొచ్చింది. అలాగే తెలంగాణాకి 2515 కోట్ల రూపాయల జిఎస్‌టి నిధులు కేంద్రం ఇవ్వాల్సి ఉండగా 1558 కోట్ల జిఎస్‌టి నిధులు కేంద్రం ఇవ్వాల్సి వుందని తెలిసింది. కొరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ప్రభావం వలన తక్కువ జీఎస్టీ సేకరణ జరిగిందని, అదే సమయంలో జీఎస్టీ పరిహార సెస్‌ ‌కూడా తక్కువగా సేకరణ జరిగిందని ఆ కారణంగా అధిక మొత్తాల్లో రాష్టాలకి జీఎస్టీ నిధులు ఇవ్వలేకపోయామని కేంద్రం వెల్లడించింది.

జీఎస్టీ పరిహారం చెల్లిచడానికి జిఎస్‌టి పరిహార నిధిలో ఉన్న మొత్తం సరిపోకపోవడంతో ఏప్రిల్‌ 20 ‌నుంచి మార్చి 21 వరకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారాన్ని పాక్షికంగా తీర్చడానికి మాత్రమే కేంద్రం ప్రయత్నం చేసి దేశంలోని అన్ని రాష్ట్రాలు / యుటిలకు కలిపి 91,000 కోట్లు విడుదల చేసింది. జీఎస్టీ(రాష్ట్రాలకు పరిహారం) చట్టం, 2017 ప్రకారం జీఎస్టీని అమలు చేయడం వలన ఆదాయ నష్టం కారణంగా రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. పలు రాష్ట్రాలు జీఎస్టీ పరిహారం చెల్లించాలని కేంద్రాన్ని అభ్యర్థించాయి. అంతే కాదు రాష్ట్రాలు సాధారణ ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని, అదనపు వైద్య పరికరాల సేకరణ మరియు పంపిణీ మంజూరును పెంచి నిధులు ఇవ్వాలని పలు అభ్యర్థనలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి వివిధ అభ్యర్థనలను పరిగణించినా ఇంతవరకు సహాయం అందించటానికి కేంద్రం ముందుకు రాలేదు. కానీ రాష్ట్రాలకు సాధ్యమైనంత సహాయం అందించడానికి కట్టుబడి ఉన్నామని కేంద్రం చెబుతున్నది.

గిరిజన పిల్లల కోసం తెలంగాణలో 12 స్కూల్స్ : ‌లోక్‌ ‌సభలో కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం
గిరిజన పిల్లలకు మంచి విద్య అందించేందుకు ట్రైబల్‌ ‌మినిస్ట్రీ ఎఫైర్స్ అనేక స్కీంలను అమలు చేస్తుందని కేంద్రం తెలిపింది. ఏకలవ్య మోడల్‌ ‌స్కూల్స్, ఆ‌శ్రమ్‌ ‌స్కూల్స్ ఇన్‌ ‌ట్రైబల్‌, ‌వివిధ స్కీమ్‌ల కింద గడిచిన నాలుగేళ్లలో దేశ వ్యాప్తంగా కొత్తగా స్కూల్స్‌ను స్థాపించినట్లు వెల్లడించింది. ఈ కోటాలో ట్రైబల్‌ ‌చిల్డ్రన్‌ ‌కోసం తెలంగాణలో కొత్తగా 12 స్కూల్స్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి రేణుక సింగ్‌ ‌తెలిపారు. లోక్‌ ‌సభలో ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు ఆమె లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, ట్రైబల్‌ ‌పాపులేషన్‌ ఎక్కువగా ఉన్న జార్ఖండ్‌, ‌చత్తీస్‌ ‌గడ్‌, ఒడిసా, మధ్య ప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో కేంద్రం ట్రైబల్‌ ‌స్కూల్స్‌ను మంజూరు చేసింది. మరోవైపు ఆంధ్రాలో కూడా 14 స్కూల్స్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.

గిరిజన జిల్లాలో 3.81 లక్షల మందికి టీకా డోసులు
తెలంగాణలో గుర్తించిన ఒక ట్రైబల్‌ ‌జిల్లాల్లో 3.81 లక్షల మందికి గిరిజనులకు కోవిడ్‌ ‌టీకా అందినట్లు కేంద్రం తెలిపింది. దేశ వ్యాప్తంగా 176 ట్రైబల్‌ ‌డిస్ట్రిక్స్‌ను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. జూన్‌ 15 ‌వరకు 4.8 కోట్ల డోస్‌లను అందించినట్లు కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్‌ ‌తెలిపారు. లోక్‌ ‌సభలో పలువరు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే, గిరిజన ప్రాంతాలు అదనపు సమస్యలు కలిగి ఉన్నందున స్పెషల్‌ ‌ఫోకస్‌ అవసరమని మంత్రి స్పష్టం చేశారు. సెమి అర్బన్‌, ‌రూరల్‌, ‌గిరిజన ప్రాంతాల్లో కోవిడ్‌ 19 ‌కంటైన్మెంట్‌, ‌మేనేజ్‌మెంట్‌ ‌కోసం కేంద్రం ఎస్‌ఓపి లు జారీ చేసినట్లు తెలిపింది. అత్యధికంగా చత్తీస్‌గడ్‌, ‌జార్ఖండ్‌, ‌మధ్య ప్రదేశ్‌లో 19, అరుణా చల్‌ ‌ప్రదేశ్‌లో 16, ఒడిసాలో 14 ట్రైబల్‌ ‌జిల్లాలను గుర్తించినట్లు కేంద్ర మంత్రి తన సమాధానంలో తెలిపారు.

Leave a Reply