Take a fresh look at your lifestyle.

అక్షయ పాత్ర ద్వారా 5 లక్షల మందికి ఆహారం..!

వంటశాల సందర్శించిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ ద్వారకాలోని అక్షయ పత్ర ఫౌండేషన్ సెంట్రల్ కిచెన్‌ను కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఢిల్లీ సౌత్ వెస్ట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సహకారంతో ఇస్కాన్ టెంపుల్ ఏర్పాటు చేసిన ఈ వంటశాల కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టే లాక్ డౌన్ వలన నిర్వాసితులు అయిన సుమారు ఐదు లక్షల మంది వలస కార్మికులకు, నిరుపేదలకు ఆహారం అందిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న మానవతా కృషిని కిషన్ రెడ్డి ప్రశంసించారు. మంత్రి స్వయంగా వంటశాలలో కలయతిరిగారు.. కొన్ని వంటలను కలుపుతూ వంట వాళ్లకు సహాయ పడ్డారు కిషన్ రెడ్డి..

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!