Take a fresh look at your lifestyle.

కేసులు పెరుగుతున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి

  • దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 149
  • కొరోనా పాజిటివ్‌ ‌కేసులు
  • హెల్త్ ‌బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి
  • భారత్‌ ‌ముందే మేల్కొందని ప్రకటించిన కేంద్రం

అత్యధికంగా కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదవుతున్న రాష్టాల్రపై ప్రధానంగా దృష్టిసారించామని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. కరోనా కట్టడి చర్యలపై రాష్టాల్రతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ ‌బులిటెన్‌ ‌విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 873 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి 21 మంది మరణించారు. 24 గంటల్లో కొత్తగా 149 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. వలస కూలీలను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. లాక్‌డౌన్‌ను ఎవరూ ఉల్లంఘించ కుండా చర్యలు చేపడుతున్నాం. కరోనా చికిత్స కోసం డాక్టర్లకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఎయిమ్స్ ‌ముందుకొచ్చింది. ర్యాండమ్‌గా నమూనాలు సేకరించాల్సిన అవసరం లేదు. ఆరోగ్య రంగానికి సౌకర్యాల కల్పనపై దృష్టిసారించాం. కరోనా కేసుల చికిత్స కోసం ఆస్పత్రులను ఏర్పాటు చేస్తాం. కరోనా పాజిటివ్‌ ఉన్నవారికి చికిత్సపై మార్గదర్శకాలు విడుదల చేశాం. లాక్‌డౌన్‌ ‌పరిస్థితులను రాష్టాల్ర వారీగా సక్షిస్తున్నాం. నిత్యావసరాల సరఫరాకు అనుమతించాలని రాష్టాల్రకు సూచించాం. రాష్టాల్ర మధ్య సరకు రవాణాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. నిత్యావసరాల ధరలు పెరగకుండా చూస్తున్నాం. అద్దె కట్టలేక, పలు సమస్యలతో రాష్టాల్ల్రో ప్రజలు వలస వెళ్తున్నారు. లాక్‌డౌన్‌, ‌వైద్యపరమైన అంశాలపై అన్ని రాష్టాల్ర సీఎస్‌లతో మాట్లాడుతున్నాం. సామాజిక దూరం సరిగా అమలు చేయాలని సూచిస్తున్నామని ఆరోగ్యశాఖ పేర్కొంది.

  • భారత్‌ ‌ముందే మేల్కొందని ప్రకటాంచిన కేంద్రం
  • ముందస్తు చర్యలు చేపట్టకుండానే

లాక్‌డౌన్‌ ‌విధించారనే విమర్శలను కేంద్ర ప్రభుత్వం తిప్పికొట్టింది. విదేశాల నుంచి వచ్చేవారిని దేశంలోకి ఇష్టారీతిన అనుమతించి.. కూలీనాలీ చేసుకునే పేదలకు రవాణా సదుపాయాలు కూడా కల్పించలేదనే ఆరోపణలు అర్థరహితమని తోసిపుచ్చింది. సమగ్ర ప్రతిస్పందన వ్యవస్థ ద్వారా భారత్‌ ‌కరోనా పోరులో చాలా త్వరగా స్పందించిందని కేంద్రం తెలిపింది. మిగతా అన్ని దేశాల కంటే మెరుగ్గా భారత్‌ ‌క్రీయాశీల, క్రమబద్ధమైన నిర్ణయాలు తీసుకుందని పేర్కొంది. అలాగే అన్ని దేశాలకన్నా ముందే విమనాశరయాల్లో స్క్రీనింగ్‌ ‌ద్వారా గుర్తించే చర్యలకు పూనుకున్నామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారశాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ మార్గదర్శకాల ముందే భారత్‌ ‌సరిహద్దుల వెంబడి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని వెల్లడించింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ఆంక్షలు, విదేశాల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్‌ ‌చేయడం, అనుమానితుల వీసాలను సస్పెండ్‌ ‌చేయడం వంటి చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.

భారత్‌లో తొలికేసు జనవరి 30న నమోదు కాగా.. అంతకు ముందే అంటే జనవరి 18 నుంచే థర్మల్‌ ‌స్క్రీనింగ్‌ ‌చర్యలు చేపట్టామని తెలిపింది. చైనా, హాంగ్‌కాంగ్‌ ‌దేశాల నుంచి వచ్చేవారికి తప్పనిసరిగా స్క్రీనింగ్‌ ‌చేశామని చెప్పింది. ’కోవిడ్‌-19 ‌మహమ్మారికి బలైన ఇటలీ, స్పెయిన్‌ ‌దేశాల్లో తొలి కేసు నమోదైన 25 రోజులకు, 39 రోజులకు ఆయా దేశాలు స్క్రీనింగ్‌ ‌మొదలు పెట్టాయి. కానీ, మనదేశం అంతకన్నా ముందే మేల్కొంది. ఎన్నో క్రియాశీల నిర్ణయాలను కేంద్రం తీసుకుంది. స్క్రీనింగ్‌తో పాటు అనుమానితులకు స్వీయ నిర్బంధం తప్పనిసరి చేశామని వివరించింది. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి.. క్వారైంటైన్‌లకు లేదంటే ఆస్పత్రికి తరలించాం. టూరిస్టులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు అని తేడా లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూశాం. సంపన్న భారతీయులకు ప్రత్యేక సదుపాయాలేం కల్పించలేదు. రాష్టాల్రతో కలిసి వైరస్‌ ‌నియంత్రణ చర్యలు ముమ్మరంగా చేపట్టామని వివరించింది. దానిలో భాగంగానే రాష్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర ఆరోగ్య మంత్రి దాదాపు 20 వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. రాష్టాల్ర ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్‌ ‌సెక్రటరీ ఆరుసార్లు సక్షలు జరిపారు. దేశ వ్యాప్తంగా 30 విమానాశ్రయాల్లో, 12 పెద్దవి, 65 చిన్న నౌకాశ్రయాల్లో, వాటితోపాటు అన్ని సరిహద్దుల్లో స్క్రీనింగ్‌ ‌చేపట్టాం. దాదాపు 36 లక్షల మందికి స్క్రీనింగ్‌ ‌చేశాం’ అని సమాచార ప్రసార శాఖ పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా 873 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, 19 మరణాలు సంభవించాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!