Take a fresh look at your lifestyle.

తెలంగాణకు ఎప్పుడూ రిక్తహస్తాలేనా..!

central govt vs telangana govt

కేంద్రంలో భారతీయ జనతాపార్టీ వచ్చినప్పటినుండి తెలంగాణకు ఎప్పుడూ రిక్తహస్తాలే చూపిస్తున్నది. గడచిన ఆరేళ్ళకాలంలో ఏ బడ్జెట్‌ ‌చూసినా తెలంగాణకు సంతృప్తికరంగా ఏ ఒక్క నిర్ణయం బిజెపి ప్రభుత్వం తీసుకున్నట్లుగా కనిపించడంలేదు. ఈ ఆరేళ్ళ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కోరికలను కేంద్రం ముందుంచింది. అయినా వాటిని నెరవేర్చే విషయంలో మోదీ ప్రభుత్వం అంతపెద్దగా శ్రద్ధ చూపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంతవరకు కేంద్రంతో ఘర్షణ పడేకన్నా, స్నేహపూరిత వాతావరణంలో తమ డిమాండ్లను సాధించుకోవాలనే ప్రయత్నంచేసింది. కేంద్రం సంచలనాత్మకంగా తీసుకున్న అనేక నిర్ణయాలకు వత్తాసుకూడా పలికింది. అయినా మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దూరంలో ఉంచాలో అంతేదూరంలో ఉంచేందుకే ప్రయత్నిస్తోంది. ఆశించినమేరకు కేంద్రంనుండి కొత్త పథకాలేవీరాకపోగా, ఉన్నవాటిని స్థానచలనంచేసి, కొత్తగా తెలంగాణకు ఏదో ఒనగూర్చినట్లుగా కంటితుడుపు చర్యలు చేపడుతోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.. తాజాగా సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల (స్పైసెస్‌) ‌బోర్డు విషయాన్నే తీసుకుంటే, అడిగింది ఒకటైతే గతంలో ఇక్కడ ఉన్నదాన్నే మార్పులుచేస్తూ నిర్ణయంతీసుకుని, అదేదో కొత్తగా కేంద్రం ఒనగూర్చినట్లుగా చెప్పడం చూస్తుంటే తెలంగాణరాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రానికి ఏమాత్రం పట్టింపులేదన్నది స్పష్టమవుతోందంటున్నారు. వాస్తవంగా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో చాలా కాలం కిందే స్పైసెస్‌ ‌బోర్డు ప్రాంతీయ కార్యాలయముంది. అలాగే నిజామాబాద్‌జిల్లాలో స్పైసెస్‌ ‌బోర్డు డివిజనల్‌ ‌కార్యాలయముంది. తాజాగా కేంద్రమంత్రి ప్రకటనను విశ్లేషించుకుంటే ఇక్కడున్న డివిజనల్‌ ‌కార్యాలయాన్నే ప్రాంతీయ కార్యాలయంగా పెంచుతారేమోనన్న అనుమానం కలుగుతున్నది. వాస్తవంగా నిజామాబాద్‌ ‌ప్రాంత ప్రజలు చాలాకాలంగా పసుపు బోర్డు కావాలని డిమాండ్‌ ‌చేస్తున్న విషయం తెలియందికాదు.

- Advertisement -

గడచిన రెండు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే అంశం ఇక్కడ కీలకంగా మారింది. నిజామాబాద్‌ ఎం‌పిగా కొనసాగుతున్న ధర్మపురి అరవింద్‌ ‌తాను పసుపుబోర్డును సాధించని పక్షంలో తన పదవికి రాజీనామాచేస్తానని ఎన్నికల సమయంలో బాహాటంగానే ప్రకటించారు. రాష్ట్రంలో అత్యధికంగా పసుపు పండించేప్రాంతాల్లో నిజామాబాద్‌ ‌ముందుంది. అయితే ఇక్కడిపసుపు రైతులు ప్రతీఏటా మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్న విషయం తెలియంది కాదు. పక్కన ఉన్న మహారాష్ట్రతో పోల్చిచూస్తే ఇక్కడ సగానికి సగం ధర లభించడంలేదు. పైగా ఇక్కడి దళారీవ్యవస్థతో వారు విసిగిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతీఏటా దాదాపు లక్ష, లక్షన్నర ఎకరాల్లో పసుపు పండిస్తున్నారు. ఒక్క నిజామాబాద్‌ ‌జిల్లాలోనే దాదాపు ముప్పై అయిదు నుంచి నలభై ఎకరాల్లో పసుపు పంటలు వేస్తున్నారు. ఎంతో కష్టపడి పండించిన పసుపుపంటకు గిట్టుబాటు ధర లభించక నిత్యం రైతుల ఆవేదన చెందుతున్నారు. దీనికి పసుపు బోర్డును ఏర్పాటుచేయడమే ప్రత్యామ్నాయమంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పసుపు బోర్డును ఎలాగైనా సాధిస్తాని నమ్మబలికిన మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత గడచిన అయిదేళ్ళ కాలంలో విఫలయత్నంచేశారు. అదే అంశాన్ని గత ఎన్నికల్లో ఆయుధంగా మలుచుకున్న ప్రస్తుత ఎంపి డి అరవింద్‌ ‌కూడా దాదాపుగా చేతులెత్తేశారు. రైతులు అడిగేది పసుపు బోర్డు అయితే కేం•్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌నిజామాబాద్‌లో స్పైసెస్‌ ‌బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదోఒకటైతే వచ్చిందికాదా.. దానితోనే సంతృప్తి పడదామంటున్నారు ఎంపి అరవింద్‌. అయితే కేంద్రం ప్రకటించిందిన స్పైసెస్‌ ‌ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్‌లో కొత్తగా ఏర్పాటుచేసేదేమీకాదు. అక్కడున్న డివిజనల్‌ ‌కార్యాలయస్థాయిని పెంచడం మాత్రమే. అయితే ఇప్పటికే వరంగల్‌లో ప్రాంతీయ కార్యాలయం పనిచేస్తున్నది మళ్ళీ నిజామాబాద్‌లో ఎలా పెడతారన్న ప్రశ్న ఉదయిస్తున్నది. అంటే వరంగల్‌నుండి ఈ ప్రాంతీయ కార్యాలయాన్ని తరలించే ఆలోచనతోనే కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేసి ఉంటారన్న విమర్శలున్నాయి.

ఈ విషయంలో ఇప్పటికే అటు నిజామాబాద్‌, ఇటు వరంగల్‌ ‌దైతులు, నాయకులు గోలపెడుతున్నారు. గత ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డును ఎట్టిపరిస్థితిలోనైనా నిజామాబాద్‌కు తీసుకువస్తానని, కాని పక్షంలో తన ఎంపి పదవిని వదులుకుంటానన్న అరవింద్‌ ఎం‌త నమ్మకంగా చెప్పాడంటే ఎన్నికలకు ముందు ఆ విషయాన్ని బాండ్‌ ‌పేపర్‌పై రాసి సంతకంకూడా పెట్టారు. దాన్ని ఆయన సాధించలేకపోగా, రైతులకు పెద్దగా ఉపయోగపడని స్పైసెస్‌ ‌ప్రాంతీయ కార్యాలయం సాధించినట్లుగా చెప్పుకోవడాన్ని రైతాంగం తీవ్రంగా విమర్శిస్తోంది. అరవింద్‌ ‌మాటలు నమ్మి పసుపు బోర్డుకోసం నిజామాబాద్‌ ‌సిట్టింగ్‌ ఎం‌పి కల్వకుంట్ల కవితను అక్కడి రైతులు ఓడించిన విషయం తెలిసిందే. ఆమెకు పోటీగా పలువురు రైతులు ఎన్నికలబరిలో దిగగా, ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళేందుకు నరేంద్రమోదీతోకూడా నిజామాబాద్‌ ‌రైతులు పోటీపడుతూ నామినేషన్లను దాఖలుచేసిన విషయంకూడా తెలిసిందే. దీనితోపాటు ఈ బోర్డుకోసం రైతులు అనేక రీతుల్లో తమ ఆందోళనలు వ్యక్తంచేశారు. ఇంకా కేంద్రానికి, రాష్ట్రానికి తెలియజేసేవిధంగా ఉద్యమిస్తున్నారుకూడా.. అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఇతర అన్ని డిమాండ్లను పక్కకు పెట్టినట్లుగానే పసుపుబోర్డు అంశాన్నికూడా పెడచెవిన పెట్టింది.

Leave a Reply